ఔను పవన్‌ రీమేక్ కంటే ముందే వీరమల్లు..!

Update: 2022-09-11 13:35 GMT
పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టి చాలా కాలం అయ్యింది. కరోనా ఇతర కారణాల వల్ల సినిమా మరీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పటికి కూడా కనీసం సగం షూటింగ్‌ పూర్తి అవ్వలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వచ్చే నెల 17 నుండి షూటింగ్ ని పునః ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తమిళ చిత్రం వినోదయ సిత్తం రీమేక్ కి వెంటనే డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. కానీ మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు పూర్తి చేయకుండా రీమేక్‌ కి డేట్లు ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావించినట్లుగా ఉన్నాడు. అందుకే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాతే వినోదయ సిత్తం రీమేక్‌ షురూ అయ్యే అవకాశం ఉందట.

పవన్‌ కళ్యాన్‌ ని మొదటి సారి పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో చూడబోతున్న నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. గత ఏడాదిలో సినిమా విడుదల అవ్వబోతుంది అనుకుంటే ఈ ఏడాది ముగింపుకు వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ను క్రిష్‌ పూర్తి చేయలేక పోవడంకు పవన్ కారణం అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటే సహజంగానే భారీ మొత్తంలో బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉంది. కనుక వెంటనే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా యొక్క నిర్మాతలపై దయ తల్చాలంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా కోరుకుంటున్నట్లుగానే మొదట పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ను ముగించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

వచ్చే నెలలో ఏపీలో జనసేన అధినేతగా పవన్ పర్యటించాల్సి ఉంది. మరి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ కి వచ్చే నెల నుండి ఎలా వస్తాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News