ఒక పక్క వీరాభిమాని - మరోపక్క ఆత్మీయ స్నేహితుడు. ఇది చాలదూ... వాళ్ల వేడుకకి పవన్ గెస్ట్ గా హాజరవడానికి? ఇద్దరిలో ఎవరు పిలిచినా పవన కాదనలేడు. అలాంటిది ఇద్దరూ పిలిచాక ఎందుకు వెళ్లడు. నితిన్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన `అఆ` సినిమా పాటల విడుదల వేడుక మే 2న శిల్పకళావేదికలో జరగబోతోంది. ఆ వేడుకకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవబోతున్నట్టు నితిన్ స్వయంగా ప్రకటించాడు.
పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన సినిమా వేడుకలకి తరచుగా హాజరవుతుంటారు పవన్ కళ్యాణ్. అలాగే అఆని తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్. ఆయనకీ, పవన్ కళ్యాణ్ కీ మధ్యనున్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఆత్మీయ స్నేహితులు. వాళ్లిద్దరి సినిమా కాబట్టే అఆ వేడుకకి పవన్ హాజరవ్వాలని నిర్ణయించుకొన్నారు. ఇటీవల తన కుటుంబానికి సంబంధించిన ఏ వేడుకకీ హాజరు కావడం లేదు పవన్ కళ్యాణ్. కానీ బయట వేడుకలకి మాత్రం కాదనకుండా వెళుతుంటారు. అలా అన్నయ్య చిరంజీవి కొత్త సినిమా ఓపెనింగ్ కూడా వెళ్లని ఆయన నితిన్ అఆ వేడుకకి మాత్రం వస్తానని మాటిచ్చారట. దీంతో నితిన్ ఆనందానికి అవధుల్లేవు. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ట్విట్టర్ లో ప్రకటించేశాడు నితిన్.