25 సినిమాలకే ఎండ్ అవుతోందా?

Update: 2017-11-16 06:46 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే టాలీవుడ్ లో అంచనాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయన్నది అందరికి తెలిసిందే. రిజల్ట్ సంగతి తర్వాత.. ముందు పవన్ మొదటి ఆటను చూశామా లేదా అన్నదే లెక్క అనేలా ఫ్యాన్స్ ఉంటారు. అయితే మరికొన్ని రోజుల్లో పవన్ ఫ్యాన్స్ ఆ మాజాని పొందలేక పోవచ్చు అనే మరో టాక్ బాగా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇంతకుముందు కూడా ఇలాంటి టాక్స్ బాగానే వచ్చాయి. పవన్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు కూడా. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న తన 25వ చిత్రం అయిపోగానే పవన్ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో పాల్గొంటాడట. దీంతో సినిమాల గురించి ఆలోచించకపోవచ్చు అని అయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంటే ఓ విధంగా 25 సినిమాలకే ఆయన సినిమా కెరియర్ ఎండ్ అవుతోందని అనుకోవాలి. అయితే ఎన్నికల రిజల్ట్ ని బట్టి కూడా పవన్ ఆలోచన ఉండవచ్చని టాక్. ప్రస్తుత చిత్రం షూటింగ్ అయిపోగానే పవన్ జనసేన పార్టీ ప్రణాళికలను పూర్తిగా ఆచరణలో పెట్టనున్నాడు.

నెక్స్ట్ ఎలక్షన్స్ కి సమయం కూడా చాలా తక్కువగా ఉంది. జనాల వరకు పార్టీని తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాలి. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ 40 కోట్ల రెమ్యునరేషన్ ని అఫర్ చేసినా పవన్ ఒప్పుకోలేదు అనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమో కాదో తెలియదు గాని మొత్తానికి పవన్ తన 26వ మూవీని అయితే ఇప్పుడు చేసే పరిస్థితుల్లే లేడు. అంటే వచ్చే ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఉండకపోవచ్చు. ఇక ఆ తర్వాత పార్టీ రిజల్ట్ ని బట్టి పవన్ నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది.. చూద్దాం పవన్ నెక్స్ట్ ఏం చేస్తాడో..   
Tags:    

Similar News