పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదో రకం. అంరదూ టెంప్ట్ అయ్యే విసయాలకు పవన్ అస్సలు టెంప్ట్ అవ్వడు. పవన్ కు ఉన్న ఇమేజ్ కు అతను ఒక ప్రకటన కోసం కొన్ని గంటలు కేటాయిస్తే చాలు.. కోట్ల రూపాయల పారితోషకం వస్తుంది. కానీ పవన్ యాడ్లలో నటించడు. అప్పుడెప్పుడో పెప్సి యాడ్లో మాత్రమే చేశాడు. తర్వాత వాళ్లు ఎంత ఆఫర్ చేసినా యాడ్ చేయలేదు. వేరే యాడ్లకు కూడా నో చెప్పాడు. సినిమాలు చేయడంలోనూ పవన్ అంతే. త్వరత్వరగా సినిమాలు చేసి సంపాదన పెంచుకోవాలన్న ఆలోచనేమీ పవన్ కు ఉండేది కాదు. ప్రకటనల విషయంలోనే కాదు.. టీవీ షోలకు సైతం పవన్ దూరంగానే ఉన్నాడు. అలాగని ఆయనకు ఆఫర్లు లేక కాదు. ఒక పాపులర్ టీవీ షోను పవన్ ఆధ్వర్యంలో నడిపించాలని ఒక టీవీ ఛానెల్ గట్టి ప్రయత్నమే చేసిందట. కానీ పవన్ ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదట. ఆ షో మరేదో కాదు.. సత్యమేవ జయతే.
హిందీలో ప్రసారమైన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ కార్యక్రమానికి అన్ని భాషల్లో విశేష స్పందన వచ్చింది. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ సాగే ఆ కార్యక్రమం ప్రేక్షకులను కదిలించింది. ఐతే ‘సత్యమేవ జయతే’ను తెలుగులో అనువాదం చేసి ప్రసారం చేయడానికి బదులు నేరుగా.. తెలుగులోనే షో చేయాలని భావించారట. ఒక టీవీ ఛానెల్ భారీ పారితోషకం ఆఫర్ చేస్తూ పవన్ ను హోస్ట్ చేయాలని అడిగారట. కానీ పవన్ అందుకు అంగీకరించలేదట. రెమ్యూనరేషన్ పెంచి అడిగినా కూడా పవన్ నో అనే అన్నాడట. సామాజిక స్పృహతో కూడిన కార్యక్రమం కాబట్టి పవన్ ఒప్పుకుంటాడని అనుకున్నా... అతను మాత్రం ససేమిరా అనేశాడట. ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.