కాటమరాయుడు కథ చెప్పేసిన పవన్

Update: 2017-03-18 17:52 GMT
సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు కథ చెప్పేయడం అంటే.. ఏ మూవీకి అయినా రిస్కే. కానీ కాటమరాయుడుకి ఇలాంటివేమీ ఉండవు. ఎందుకంటే.. అది పవర్ స్టార్ మూవీ అనే ఒక్క రీజన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బోలెడన్ని కబుర్లు చెప్పిన పవన్.. చివరకు సింపుల్ గా స్టోరీ లైన్ కూడా చెప్పేసి ఆశ్చర్యపరిచాడు.

'నేను ప్రతీ సినిమా కష్టపడే చేస్తాను.. ప్రమోషన్ లాంటివి నచ్చు. మీకు నచ్చితే చూడండి. మీకు నచ్చకపోతే మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా తీసుకుంటా. నాకు శరత్ మరార్ మిత్రుడు. ఆయన కోసమే ఈ సినిమా చేశాను. వీరం రీమేక్ చేయాలని అనుకున్నపుడు రాయలసీమ ప్రాతం గురించి ఆకుల శివ అయితే రాయగలరని అనిపించి రాయించాం. డాలీ సున్నితమైన హాస్యంతో బాగా తీస్తారు. ఆయన కామెడీ నాకు ఇష్టం' అన్నాడు పవన్ కళ్యాణ్.

'నేను ఎప్పుడూ జీవితంలో తమ్ముడినే. మొదటిసారి ఈ సినిమాలో నేను అన్నయ్యను అయ్యాను. పాత్రకోసం అన్నగా మారిపోయాను. కానీ నాకు తమ్ముళ్లు నచ్చారు. అజయ్.. చైతన్య కృష్ణ.. కమల్ కామరాజ్.. శివబాలాజీ' అంటూ పేర్లు చెప్పిన పవన్.. 'వీళ్లు నాప్రాణం.. ఏం మాట్లాడుతున్నావ్' అంటూ సినిమాలో డైలాగ్ కూడా పేల్చాడు.

' ఇంతకీ అసలు ఈ సినిమా కథేంటంటే.. నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు.. వీళ్లంతా కలిసి నన్ను ఎలా ప్రేమలో ముంచేస్తారన్నదే కథ' అంటూ స్టోరీ లైన్ చెప్పేసిన పవర్ స్టార్.. చివరగా ఆలీతో కాసింత కామెడీ చేసి ఫంక్షన్ ని ముగించాడు. 'నా చేతిలో శక్తి ఉందని నమ్ముతారా? నేను తాకకుండానే ఆలీ డ్యాన్స్ వేస్తాడు' అంటూ ఆలీకి చక్కిలిగింతలు పెట్టి.. జైహింద్ చెప్పేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
Tags:    

Similar News