సర్దార్ కి సెన్సార్ డేట్ ఇదే..

Update: 2016-03-24 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ జెట్ స్పీడ్ లో సిద్ధమైపోతోంది. మొదట్లో ఆలస్యం చేసిన యూనిట్.. చివర్లో స్పీడ్ పెంచేసింది. ప్రస్తుతం సర్దార్ యూనిట్ స్విట్జర్లాండ్ లో చక్కర్లు కొడుతోంది. ఆడియో వేడుక పూర్తి కాగానే.. రెండు పాటల షూటింగ్ కోసం పవన్ - కాజల్ సహా మెయిన్ యూనిట్ అంతా స్విట్జర్లాంట్ వెళ్లిపోయారు. ఈనెల 27కల్లా స్విస్ లో షూటింగ్ పూర్తి కానుంది. తిరిగి ఇక్కడకు రాగానే.. వాటికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసేయనున్నారు.

ఇప్పటికే సర్దార్ కి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోగా.. డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ ని ఏప్రిల్ 8న విడుదల చేయడంలో ఎటువంటి మిస్టేక్ జరగకుండా నిర్మాత శరత్ మరార్ పక్కాగా ప్లానింగ్ చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ నుంచి యూనిట్ రాగానే ఎడిటింగ్ వర్క్స్ పూర్తి చేసేసి.. ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుని సెన్సార్ కి అప్లై చేయనున్నారట. ఏప్రిల్ 1న కానీ 2వ తేదీన కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ ను సెన్సార్ చేయించేందుకు నిర్ణయించారు.

సర్దార్ మూవీని తెలుగు - హిందీ భాషల్లో విడుదల చేస్తుండడంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం ముందే సెన్సార్ సర్టిఫికేట్ చేతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల బుకింగుల కోసం సెన్సార్ కాపీ కంపల్సరీ కావడంతో.. వారం ముందే ఈ కార్యక్రమం పూర్తి చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 8న సర్దార్ మూవీ రిలీజ్ అవుతుందని అంటున్నాడు నిర్మాత శరత్ మరార్.
Tags:    

Similar News