పవన్ సత్యాగ్రహి మళ్ళీ తెరపైకి..??

Update: 2019-10-30 07:07 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి.  పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ అద్యక్షుడిగా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ రీ-ఎంట్రీ వార్తలు ఆగడం లేదు. పవన్ స్వయంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పటికే ఈ విషయం హాట్ టాపిక్ అయింది. క్రిష్ లాంటి దర్శకుల పేర్లు.. మైత్రీ మూవీ మేకర్స్.. దిల్ రాజు లాంటి పేర్లు కూడా పవన్ సినిమాకు సంబంధించి వినిపిస్తున్నాయి.

ఈ లిస్టులో కొత్తగా 'సత్యాగ్రహి' కూడా జాయిన్ అయింది.  ఈ టైటిల్ వినగానే పవన్ అభిమానులు వెంటనే గుర్తుపట్టేస్తారు.  ఎందుకంటే ఇది పవన్ డ్రీమ్ ప్రాజెక్టు.  2006 లో ఈ సినిమాను లాంచ్ చేశారు. కానీ కొద్దిరోజుల తర్వాత పక్కన పెట్టేశారు.  ఈ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమాలా కాకుండా సామాజిక సమస్యలపై పోరాటం నేపథ్యంలో రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమా మళ్ళీ పట్టాలెక్కుతుందని ఎవరూ అనుకోలేదు.  అయితే తాజాగా ఈ సినిమాను రివైవ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఈ కథ చాలా ఇష్టమైనది కావడం.. ప్రస్తుతం తన రాజకీయ జీవితానికి సంబంధించిన ఫిలాసఫీని ప్రజలకు చేరువ చేసే అవకాశం ఉండడంతోనే పవన్ మరోసారి 'సత్యాగ్రహి' గురించి అలోచిస్తున్నారనే టాక్ ఉంది.  పవన్ దగ్గర ఎప్పటినుంచో నిర్మాత ఎయం రత్నం ఎడ్వాన్స్ ఉందని దీంతో ఆ కమిట్మెంట్ కూడా పూర్తవుతుందనే అనుకుంటున్నారట.

ఈ సినిమా బాధ్యతలు క్రిష్ చేతిలో పెట్టే ఆలోచన ఉందట. క్రిష్ గతంలో రూపొందించిన 'కృష్ణం వందే జగద్గురుం'.. 'కంచె' చిత్రాలు కమర్షియల్ హిట్స్ కాలేదు కానీ విమర్శకులను మెప్పించాయి.  క్రిష్ అయితేనే 'సత్యాగ్రహి' స్క్రిప్ట్ కు న్యాయం చేయగలరనే ఆలోచనలో పవన్ ఉన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని సమాచారం
Tags:    

Similar News