ఈ మధ్య మన స్టార్ హీరోలకు కథానాయికల్ని ఎంచుకోవడం చాలా కష్టమైపోతోంది. పెద్ద సినిమాలు అనగానే అందరికీ సమంత.. తమన్నా.. కాజల్.. వీళ్లే గుర్తొస్తున్నారు. వీళ్లను దాటి వేరే హీరోయిన్ల వైపు చూస్తే.. వాళ్లు పెద్ద హీరోల పక్కన ఆనరేమో అన్న డౌటు. ఇక కొత్త అమ్మాయిల్ని చూద్దామంటే.. వాళ్లతో ఉండే తలనొప్పులు వాళ్లతో ఉన్నాయి. హీరోల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంటే.. హీరోయిన్ల కొరత అదే స్థాయిలో పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో హీరోయిన్ సమస్య ఎదురైంది. ఇందులో హీరోయిన్ గా రకరకాల పేర్లు పరిశీలించి చివరికి అనీషా ఆంబ్రోస్ ను ఎంచుకున్నాడు పవన్. కానీ అభిమానులు ఒప్పుకోలేదు. దీంతో చివరికి కాజల్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది.
ఇక పవన్ తర్వాతి సినిమాకు హీరోయిన్ ఎవరనే ప్రశ్న మొదలైంది. ఉన్న స్టార్ హీరోయిన్లనే తిప్పి తిప్పి కొట్టడం కన్నా ఈసారి కొత్తమ్మాయితో లాగించేద్దామని ఫిక్సయ్యాడట ఎస్.జె.సూర్య. ముంబయిలో కొత్తమ్మాయిల ప్రొఫైల్స్ కోసం వెతుకుతున్నాడట. సూర్య దర్శకత్వంలో తాను చేయబోయేది ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని పవన్ ఇప్పటికే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఖుషి’ తరహాలో లవ్.. యాక్షన్ రెండు మిళితమైన స్క్రిప్టు సిద్ధం చేశాడట సూర్య. స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మేలో ఈ సినిమా ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నారు. జూన్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. పవన్ తో ‘గోపాల గోపాల’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మించిన శరత్ మరారే ఈ చిత్రానికి నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.