చందమామతో పవన్ పాటేసుకుంటున్నాడు

Update: 2015-12-01 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఫుల్లు బిజీగా ఉన్నాడు. కొన్ని వారాలుగా గుజరాత్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న విధానంతో యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి, దర్శకుడిని ప్రోత్సహిస్తున్నాడట.

ముఖ్యంగా ప్రతీ ఫ్రేమ్ పై బాబీ శ్రద్ధని చూసి నిర్మాత శరత్ మరార్ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఆశ్చర్యపోవాల్సి వస్తోందంట. పవన్ కి బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి బాబీ కష్టపడుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఔట్ పుట్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలను షేర్ చేసుకుంటున్నాడు నిర్మాత. హీరోయిన్ కాజల్ కూడా తన గెటప్ ని షేర్ చేసి, ఫ్యాన్స్ ని ఖుషీ రీసెంట్ గా చేసింది. ప్రస్తుతం వడోదరాలోని రాయల్  ప్యాలెస్ పాట పాడుకుంటున్నాడు సర్దార్. అద్భుతమైల లొకేషన్ లో సూపర్బ్ కాస్టూమ్స్ తో ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట. మరో వారంపాటు ఈ సాంగ్ షూట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8తో దీన్ని కంప్లీట్ చేసి, గుజరాత్ షెడ్యూల్ ని క్లోజ్ చేయబోతోంది సర్దార్ యూనిట్. ఆ తర్వాత హైద్రాబాద్ లోనే మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.

హైద్రాబాద్ వచ్చాక.. మరో ఇద్దరు ముద్దుగుమ్మలు లక్ష్మీరాయ్, సంజనలు కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పాటల కంపోజింగ్ లో బిజీగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ కి మించిన ఆల్బం ఇస్తానంటున్నాడు డీఎస్పీ.
Tags:    

Similar News