‘సత్యాగ్రహి’ క్యాన్సిల్‌ కు కారణం చెప్పిన పవన్‌

Update: 2018-12-17 05:55 GMT
పవన్‌ కళ్యాణ్‌ హీరో గా వరుస విజయాలు దక్కించుకున్న సమయంలో 2006వ సంవత్సరం లో ‘సత్యాగ్రహి’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఆ సినిమా కు స్వయంగా తానే దర్శకత్వం వహించబోతున్నట్లు గా కూడా ప్రకటించి సినిమాను ప్రారంభించడం జరిగింది. ఏఎం రత్నం నిర్మాణం లో ఆ చిత్రం నిర్మాణం ప్రారంభం అయ్యింది. సినిమా కు సంబంధించిన ఒక పోస్టర్‌ ను కూడా అప్పుడు విడుదల చేశారు. కాని ఎలాంటి ప్రకటన చేయకుండా ఆ సినిమాను క్యాన్సిల్‌ చేశారు. తాజాగా ఈ సినిమా క్యాన్సిల్‌ కు సంబంధించిన విషయం పై పవన్‌ నోరు విప్పాడు.

పవన్‌ ప్రస్తుతం జనసేన ప్రవాస గర్జన కార్యక్రమం లో పాల్గొంటున్నారు. ఆ సందర్బంగానే ఒక సమావేశం లో మాట్లాడుతూ సత్యగ్రహి మూవీ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం తాను ఏ విషయాల పై నిజ జీవితంలో పోరాడుతున్నానో అవే విషయాలను ఆ సినిమాలో చూపించాలనుకున్నాను. సమాజంలో ఉన్న సమస్యలను సినిమాల్లో చూపించడం వల్ల అవి పరిష్కారం కావని అప్పుడే భావించి ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నాను. అప్పుడు ఆన్‌ స్క్రీన్‌ చేయలేక పోయినదాన్ని ఇప్పుడు రియల్‌ లైఫ్‌ లో చేస్తున్నట్లుగా పవన్‌ చెప్పుకొచ్చాడు.

జానీ సినిమా తర్వాత పవన్‌ ‘సత్యగ్రహి’ సినిమాకు రెండవ సారి దర్శకత్వం వహించాలని భావించాడు. పవన్‌ ఆ మూవీ ప్రకటించగానే అంతా కూడా ఎంతో ఆసక్తి చూపించారు. సినీ వర్గాల్లో కూడా ఆ సినిమా పై ఆసక్తి ఏర్పడినది. కాని సినిమా ఆగిపోవడంతో అంతా నిరుత్సాహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో కూడా ఆ సినిమా చేసే ఆలోచన లేదని పవన్‌ ఇండైరెక్ట్‌ గా చెప్పేశాడు. ప్రస్తుతం పవన్‌ పూర్తి గా రాజకీయాలకే పరిమితం అయ్యాడు. భవిష్యత్తు లో రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన సినిమాలు చేసేది లేనిది తేలే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

Tags:    

Similar News