'పవన్ - సురేందర్' సినిమా అప్డేట్: 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్'..!

Update: 2021-09-02 09:41 GMT
నేడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ తో పాటుగా 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల తేదీ ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి - పవన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

''యథా కాలమ్.. తథా వ్యవహారమ్'' అంటూ సంస్కృతంలోని లైన్స్ తో పవన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇందులో ఓవైపు గన్ మరోవైపు హైదరాబాద్ నగరాన్ని చూపిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్ కథతో రాబోతున్నట్లు ఈ ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్ తోనే హింట్ ఇచ్చారు. స్టైలిష్ సినిమాలకు పెట్టింది పేరైన సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ తో అసోసియేషన్ అవడం గర్వకారణమని మేకర్స్ పేర్కొన్నారు.

SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9 గా పవన్ - సూరి ప్రాజెక్ట్ రూపొందనుంది. పవన్ కు సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సురేందర్ రెడ్డి తో కలిసి ఎన్నో హిట్ చిత్రాలకు వర్క్ చేసిన దర్శక రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. గతేడాది పవర్ స్టార్ కి బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్ తో వచ్చారు మేకర్స్. వర్కింగ్ టైటిల్ కూడా ఇవ్వకపోవడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త సమయం పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ అక్కినేని తో చేస్తున్న 'ఏజెంట్' సినిమా పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News