జనసేన అధినేతను మళ్లీ పవర్ స్టార్ గా చూడాలని అభిమానులు తహతహలాడిపోతున్నారు. గత ఏడాది అజ్ఞాతవాసి రిలీజయ్యాక పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు చూడని సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ పునరాగమనం గురించి చర్చ జరుగుతోంది. తన రీఎంట్రీ గురించి పవన్ ఇంకా మాట్లాడలేదు కానీ.. పింక్ రీమేక్ తో అతను పునరాగమనం చేయడం లాంఛనమే అన్నది తెలిసిన సంగతే. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశముంది. ఐతే ఈ సినిమా పట్టాలెక్కకముందే పవన్ దీని తర్వాత చేయబోయే సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తన 27వ సినిమాలో పవన్ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడన్నది తాజా సమాచారం.
పింక్ రీమేక్ తర్వాత పవన్.. విలక్షణ దర్శకుడు క్రిష్ తో కలిసి పని చేయొచ్చని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కోసం క్రిష్ ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథను సిద్ధం చేశాడని.. ఇటీవలే అది పవన్ కు వినిపించాడని.. విన్న వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపించబోతున్నట్లు టాక్. ఐతే రీఎంట్రీలో సామాజికాంశాలున్న సినిమాలే చేయాలనుకుంటున్నాడని వార్తలు రాగా.. ఇలా దొంగ క్యారెక్టర్ చేస్తాడా అన్నది డౌటు. ఐతే క్రిష్ ఏ కథను ఎంచుకున్నా దాన్నుంచి ఎంతో కొంత మంచి చెప్పే ప్రయత్నమే చేస్తాడు కాబట్టి అందోళన అవసరం లేకపోవచ్చు. ఈ ప్రచారం నిజమైతే మాత్రం పవన్ చేయబోయే తొలి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇదే అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది.