కళాతపిస్వి కే.విశ్వనాధ్ కి దాదా సాహెబ్ ఫాల్కె వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. పెద్దాయనను అభినందించడానికి మెగాస్టార్ చింరీజవి వెళ్ళి తన గురు భక్తిని చాటుకున్నారు. చిరు వెళ్లినప్పుడు విశ్వనాథ్ ఫోన్ లో మాట్లాడుతుండగా.. ఆయన ఫోన్లో మాటలాడుతున్న౦త సేపు చిరింజీవి నిలబడే ఉండి పెద్దాయన పై తనకున్న గౌరవం తెలియపరిచాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మళ్ళీ అన్నయ్యను ఫాలో అయ్యాడు.
పవన్ కల్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ కలిసి విశ్వనాథ్ గారిని అభినందించడానికి వెళ్లారు. పవన్ కు పెద్దలపై ఉండే భక్తి భావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మరోసారి ఋజువు అయింది. వెళ్ళి వెళ్ళడంతోనే విశ్వనాథ్ గారి కాళ్ళకి నమస్కరించి పక్కనే ఉన్న ఆయన ధర్మపత్నికి కాళ్ళకు కూడా నమస్కరించాడు పవన్. మనోడు ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు..మొన్నామధ్యన పవన్ సంకురాత్రి ఫౌండేషన్ స్థాపకుడు అయిన డా. చంద్రశేఖర్ ను కలసినప్పుడు కూడా అలాగే పాదాభివందనం చేసి తన సంస్కారం చాటుకున్నాడు.
సాధారణంగా పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కరించడం అనేది మన సంస్కృతే కాని.. ఈ మధ్య కాలంలో పోష్ కిడ్స్ ఎవరూ అది ఆచరించట్లేదు. బహుశా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఎవరైనా అలాంటి పోష్ పీపుల్ ఉంటే.. వారు తమ ఫేవరేట్ హీరోను చూసి నేర్చుకుంటే బెటర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/