టెక్నాలజీతో ఈ రోజుల్లో ఏమైనా చేసేయొచ్చు. సోషల్ మీడియాలోనే తిష్ట వేసే కొందరు జనాలు సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఎన్నెన్నో అసాధారణమైన పనులు చేస్తుంటారు. లేనివి సృష్టించి.. మనల్ని భ్రమల్లోకి నెడుతుంటారు. ఆ మధ్య మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఒక గ్రూప్ ఫొటో దిగితే.. ఆ ఫొటో ముందు పవన్‌ను తీసుకొచ్చి పెట్టి.. అతనే సెల్ఫీ తీస్తున్నట్లుగా క్రియేట్ చేసి ఆశ్చర్యపరిచారు జనాలు. దీని ఒరిజినల్ ఫొటో చూడని వాళ్లు.. ఇదే నిజమని భ్రమించే అవకాశం కూడా ఉంది. తాజాగా పవన్‌కు సంబంధించి అలాంటి ఫొటో మరొకటి క్రియేట్ చేశారు.
పవన్ ఇటీవలే లండన్లో ఓ అవార్డు అందుకోవడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆ ఆడిటోరియంలో గోడలకు తగిలించిన ఫొటోల్ని ఆసక్తిగా గమనించాడు పవన్. వాటిని తన మొబైల్లోకి నిక్షిప్తం చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఆ సమయంలో పవన్ ఒక ఫొటోను ఆసక్తిగా తిలకిస్తుండగా.. గోడమీదున్న చిత్రం స్థానంలో మెగాస్టార్ చిరంజీవి పాత ఫొటో ఒకటి సెట్ చేసి తన క్రియేటివిటీ చూపించాడు ఒక నెటిజన్. ఇది చూడ్డానికి చాలా సహజంగా కనిపిస్తూ ఇది నిజమేనేమో అనే అభిప్రాయం కలిగిస్తోంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఇది నిజమనుకుని అన్న మీద తమ్ముడి ఆరాధన చూడండి అంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. దీన్ని సరదాగా తీసుకుంటే ఓకే కానీ.. నిజమని నమ్మేస్తేనే కష్టం.