'ఓ మై ఫ్రెండ్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్.. చాలా గ్యాప్ తర్వాత 'ఎంసీఏ' సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. కేవలం రెండు సినిమాల అనుభవంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
'అజ్ఞాతవాసి' పరాజయం తరువాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. "వకీల్ సాబ్" చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'పింక్' రీమేక్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన 'వకీల్ సాబ్' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్ గానే నిలిచింది. అయితే పవన్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి అభిమానులు వేణు శ్రీరామ్ ను కొనియాడారు.
అయితే ఈ సినిమా వచ్చి నెలలు గడిచి పోతున్నా ఇంతవరకు దర్శకుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి కూడా ఇంకా ఖాళీగా ఉండటమేంటని అందరూ ఆశ్చర్యపోయారు.
నిజానికి అల్లు అర్జున్ తో అప్పట్లో ఆగిపోయిన 'ఐకాన్ - కనబడుటలేదు' చిత్రాన్ని వేణు శ్రీరామ్ తిరిగి ప్రారంభిస్తారని నివేదికలు వచ్చాయి. దిల్ రాజు కూడా అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు. కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.
'పుష్ప' తర్వాత అమాంతం క్రేజ్ పెరగడంతో.. ఇప్పుడు టైర్ -2 దర్శకులతో పనిచేయడానికి బన్నీ ఆసక్తి చూపడం లేదనే కామెంట్స్ వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే వేణు తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు 'వకీల్ సాబ్' దర్శకుడు ఏమి చేస్తున్నారనే దానిపై సమాచారం లేదు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణంగా మరోసారి వారాల్లో నిలిచాడు వేణు శ్రీరామ్. 'జనసేన' అధినేత ప్రతి ఏడాది సమ్మర్ లో తన తోటలో పండిన మామిడి పండ్లను సినీ ప్రముఖులకు సన్నిహితులకు పంపిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అందరికీ మ్యాంగోస్ పంపించారు.
ఇందులో భాగంగా వేణు శ్రీరామ్ కుటుంబానికి కూడా కొన్ని మామిడి పండ్లను బహుమతిగా పంపించారు పవన్. ఈ విషయాన్ని దర్శకుడి సతీమణి గాయత్రీ శ్రీరామ్ తన ట్విట్టర్ వేదికగా పంచుకుంది. తాజా మామిడి పండ్లను పంపినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.
వేణు శ్రీరామ్ ప్రస్తుతం ఏ విధంగానూ ప్రేక్షకుల దృష్టిలో లేరు. పవన్ కళ్యాణ్ ఆయన్ని గుర్తుపెట్టుకొని మరీ మామిడి పండ్లను పంపించడం అభినందించాల్సిన విషయమే. అయితే దీన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే నెటిజన్లు ఉన్నారు. పవన్ తో సినిమా చేసిన తర్వాత వేణుకు మామిడిపండ్లు మాత్రమే మిగిలిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు వేణు శ్రీరామ్ కొత్త కథలు రాసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అలానే 'ఐకాన్' సినిమా ఉండే అవకాశం ఉందని ఇటీవల నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.అల్లు అర్జున్ మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో ఉంది కాబట్టి.. దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్ ను మార్చాల్సి ఉందని అన్నారు. మరి త్వరలోనే వేణు నుంచి తదుపరి అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.