వివాదంతో ప్రచారం దక్కించుకున్న బ్యూటీగా పాయల్ ఘోష్ పేరు మార్మోగింది. తనపై ప్రముఖ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేయగా ఈ ఎపిసోడ్ పై దర్యాప్తు సాగింది. అనంతరం కాలంలో పాయల్ వరుస ఫోటోషూట్లు అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. అయితే వివాదంతో ప్రచారం పాయల్ కి ఏమాత్రం కలిసి రాలేదు. అది కెరీర్ పరంగా కూడా అక్కరకు రాలేదని తేలింది.
ఇప్పటికీ పాయల్ నిరంతరం వేడెక్కించే హాట్ ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తోంది. కానీ అవేవీ ఆఫర్లు తేలేదు. తనకు అవకాశం కల్పించిన టాలీవుడ్ సైతం ఇటీవల పాయల్ కి ఆఫర్లు ఇవ్వలేదు. ఇకపోతే పాయల్ ఘోష్ తన పుట్టినరోజున క్యాన్సర్ కిడ్ రోగులకు వెంట్రుకలు దానం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్ లో క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లల కోసం తాను విరాళం ఇవ్వనున్నట్లు నటి పాయల్ ఘోష్ వెల్లడించారు. పాయల్ ఘోష్ మాట్లాడుతూ- ఈ సంవత్సరం నవంబర్ 13 న పుట్టినరోజు సందర్భంగా నిజంగా ఒక మార్పు కోరుకున్నాను.. అని తెలిపారు.
``నేను 6 సంవత్సరాల వయస్సులో మా అమ్మను కోల్పోయాను. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. అప్పటి నుంచి క్యాన్సర్ పేషెంట్ల కోసం పనిచేయాలనేది నా మనసులో ఉండేది. క్యాన్సర్ రోగుల కోసం పనిచేసే ఇలాంటి అనేక సంస్థలను ఆసుపత్రులను నేను క్రమం తప్పకుండా సందర్శిస్తాను. ఈ ప్రాణాంతక వ్యాధి ఉన్న పిల్లలకు ప్రపంచం అన్యాయం చేసింది. వారికి కొంత సంతోషాన్ని కలిగించడానికి ప్రయత్నించడం మా కర్తవ్యం`` అని ఘోష్ పంచుకున్నారు.
నేను వీలైనంత ఎక్కువ మందిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని కోరుకుంటున్నాను. ప్రపంచం మారాలనేది నా ఆకాంక్ష. ఈ ఏడాది మనందరికీ కష్టతరమైన సంవత్సరం.. తుఫాన్ ను ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా కలిసి నిలబడగలమో చూపించాం. ఇది మానవ ఆత్మ విజయం .. నేను చాలా గర్వపడుతున్నాను. మనం ఎలా ఉన్నామో అలాగే ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. నేను పిల్లలను ప్రేమిస్తున్నాను. వారు క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. వారికి నేను చేయగలిగినదంతా నా అదృష్టంగానే భావిస్తాను. వారందరి కోసం ప్రార్థిస్తున్నాను`` అని ఘోష్ చెప్పారు.
మొత్తం విరాళం ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. ``నేను నా రాబోయే చిత్రం రెడ్ ను పూర్తి చేసిన వెంటనే నేను సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలి. ఏం చేయాలో ఆసుపత్రి నన్ను కోరిన విధంగా నేను చేస్తాను`` అని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో దేశంలో రెండవ వేవ్ కోవిడ్ సంక్షోభం సమయంలో ఆసుపత్రి పడకలు- మందులు - ఆక్సిజన్ సిలిండర్లను రోగులకు లభించేలా ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి సహాయం చేసిన పాయల్ ఇప్పుడిలా మరో కొత్త మార్పును కోరడం ఆహ్వానించదగినది.
ఇక పాయల్ తన స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీలో కేక్ కట్ చేస్తూ కనిపించిన తీరు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. హాటెస్ట్ పాయల్ దుబాయ్ లోని విలాసవంతమైన భవంతిలో తన వారితో కలిసి పార్టీని చేసుకుంది. ఈ సందర్భంగా తళుకుబెళుకుల షిమ్మరీ డ్రెస్ లో ధగధగలాడిపోయింది. కాస్త టూమచ్ గానే ఎక్స్ పోజ్ చేస్తూ వేడెక్కించింది.