కాస్టింగ్‌ కౌచ్‌ ఇంకా ఉందంటున్న హీరోయిన్‌

Update: 2019-08-29 13:59 GMT
ఈమద్య కాలంలో మీడియాలో మీటూ ఉద్యమం మరియు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్న కారణంగా మహిళలపై లైంగిక వేదింపులు తగ్గాయని అంతా భావిస్తున్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ పూర్తిగా కనుమరుగయ్యి ఉంటుందని భావిస్తున్నారు. కాని మీటూ ఉద్యమం ఓ స్థాయిలో నడిచిన సమయంలో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ కొనసాగిందని.. కొందరు కొత్త హీరోయిన్స్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పూత్‌ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తూ తమిళంలో రెండు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న పాయల్‌ రాజ్‌ పూత్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. తాను 'ఆర్‌ ఎక్స్‌ 100' చేసిన తర్వాత పెద్ద సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని కొందరు నా వద్దకు వచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి సెక్సువల్‌ గా కమిట్‌ మెంట్‌ ఇవ్వాలని కోరారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అందుకే పలు సినిమాల్లో ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

లైంగికంగా సుఖంను అందించి సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కించుకోవాలని నేను అనుకోవడం లేదు. అందుకే నేను అలాంటి దారిలో వెళ్లలేదంది. మీటూ ఉద్యమం గురించి ఇంతగా చర్చ జరుగుతున్న సమయంలో కూడా హీరోయిన్స్‌ లైంగిక వేదింపులు వేదుకుంటున్నారంటూ పాయల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈమద్య కాలంలో కాస్టింగ్‌ కౌచ్‌ ను ఎదుర్కొన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పూత్‌ మాత్రమే. పలువురు హీరోయిన్స్‌ ఈ విషయం గురించి చెప్పినా తాము గతంలో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పారు. మీటూ ఉద్యమం మొదలయ్యాక కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ను పాయల్‌ ఎదుర్కోవడం ఆశ్చర్యంగా ఉంది. మీటూ ఉద్యమంపై సోషల్‌ మీడియాలో ఇంతగా ప్రచారం జరుగుతున్నా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండటం బాధాకరం.
Tags:    

Similar News