ఆఫ‌ర్ల కోస‌మేనా పాయ‌ల్ ఈ పాట్లు?

Update: 2021-02-05 03:30 GMT
ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ అవకాశాల కోసం టాలీవుడ్ లో వెతికే భామ‌ల‌కు కొద‌వేమీ లేదు. ముంబై- కోల్ క‌త- గోవా -దిల్లీ- బెంగ‌ళూరు- చెన్నై .. ఇలా మెట్రో న‌గ‌రాల నుంచి హైద‌రాబాద్ కి వ‌చ్చి గ‌ల్లీ గ‌ల్లీ చెప్పుల‌రిగేలా తిరిగే మోడ‌ల్స్ ఉన్నారు. కొంద‌రు మోస‌పోతుంటే మ‌రికొంద‌రు మాత్రం అదృష్టం కొద్దీ ఏదో ఒక అవ‌కాశం ద‌క్కించుకుని అటుపై చేతినిండా సంపాదించుకుని ఉడాయిస్తున్నారు.

అయితే అన్ని కష్టాలేవీ లేకుండానే ఆర్.ఎక్స్ 100 లాంటి తొలి చిత్రంతోనే నేము ఫేము సంపాదించిన పాయ‌ల్ ఇప్ప‌టికే కోట్ల‌లో ఆర్జించింది. ఒక్కో సినిమాకి 30-40 ల‌క్ష‌లు సంపాదించినా ఇప్ప‌టికే 3-4 కోట్లు ఆర్జించింద‌న్న‌ది ఓ అంచ‌నా. అప్ప‌ట్లో క్రేజు ఉన్న‌ప్పుడు ఒక్క సినిమాకే 90ల‌క్ష‌ల వ‌ర‌కూ డిమాండ్ చేసింద‌న్న గుస‌గుస‌లూ వినిపించాయి.

అయినా ఇప్ప‌టికీ  ఈ అమ్మ‌డు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే అంటోంది. ఇదిగో అంత‌ర్జాలంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో అవ‌కాశాల వేట సాగిస్తున్న తీరు అభిమానుల్లో సందేహానికి కార‌ణ‌మ‌వుతోంది. ఒక హిట్టు ఒక ఫ‌ట్టు అంటూ ఇన్నాళ్లుగా జ‌ర్నీ సాగినా ఇక‌పైనా ఇదే ఊపు కొన‌సాగుతుందా? అంటే డౌటే. అందుకే పాయ‌ల్ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

తాజా ఫోటోషూట్ లో వైట్ టాప్ లో టాప్ లేపేసింది. హ‌లో స‌న్ షైన్ అంటూ వ‌స్త్ర దుకాణానికి ప్ర‌చారం చేసింది. ప్ర‌స్తుతం హాట్ పాయ‌ల్ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ఈ అమ్మ‌డు అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్న మ‌హా స‌ముద్రంలో అవ‌కాశం అందుకున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రికి ఆర్.ఎక్స్ 100తో తొలి అవ‌కాశం ఇచ్చిన ఆయ‌నే ఆదుకోవాల్సొచ్చింది అన్న గుస‌గుస‌లు టాలీవుడ్ లో వేడెక్కిపోతున్నాయ్.
Tags:    

Similar News