`పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` సిరీస్ అభిమానులకు జానీ డెప్ గురించి పరిచయం చేయాల్సిన పనే లేదు. ఈ సిరీస్ లో ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. ఇప్పుడు ఆరో సినిమా కోసం డిస్నీ సంస్థ జానీ డెప్ ని ఒప్పించేందుకు నానా తంటాలు పడుతోందట. అతడు ఓకే అంటే తిరిగి ఫ్రాంఛైజీలో కొత్త సినిమాని కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఇక జానీ డెప్ కి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చిందో ఇదిగో ఇక్కడ అదే గెటప్ లో ఉన్న పాయల్ రాజ్ పుత్ వేషాలు చూస్తే ఇట్టే చెప్పేయొచ్చు. పొడవాటి ముతక జుత్తు.. పాము కోరల గడ్డం.. తలకు చుట్టిన ఎర్రని గుడ్డ పేలిక.. ఆ గెటప్ చూస్తేనే సంథింగ్ ఏదో వెరైటీ ఆకర్షిస్తుంది. ప్రపంచంలోనే వేరే ఏ ఇతర నటుడు చూపించలేనన్ని హావభావాల్ని ఆ ముఖంలో ప్రదర్శించడం జానీ డెప్ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలు తనకు కూడా ఉన్నాయి! అన్నంత కలరింగ్ ఇస్తోంది పాయల్.
అదంతా ఎలా సాధ్యం? అంటే డిజిటల్ మాయా ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. ఫేస్ యాప్ ని ఉపయోగించి ఇలా వింత వేషం వేసింది పాయల్. అచ్చు గుద్దినట్టు బాగానే సెట్టయ్యింది ఆ వేషానికి. నిజానికి జానీ డెప్ లో ఉన్నంత విలక్షణ నటప్రతిభ తనకు కూడా ఉంటే ఆ తరహా క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి మన దర్శకులకు కష్టమేమీ కాదు. అయితే అంతకుమించి కొత్తగా చేస్తేనే అది వర్కవుటవుతుంది. కానీ ఏదో ఇమ్మిటేషన్ చేసేస్తానంటే కుదరదు.
``హహా.. దిస్ ఈజ్ సో అమేజింగ్. నీ డ్రీమ్ క్యారెక్టర్ లో నిన్ను చూసుకోవడం ఎంత కూల్ గా ఉంటుందో కదా!`` అంటూ కవ్వించేసింది పాయల్. అయితే ఇన్నాళ్లు పాయల్ లోని జానీ జఫ్ఫాని తెలుగు ఆడియెన్ మిస్సయ్యారన్నమాట. పాయల్ కి వేరే ఆఫర్లు ఏవీ లేవ్. దీంతో ఇలా ఖాళీ సమయంలో ఇలాంటి జఫ్ఫా వేషాలేస్తోంది. తనని మునుముందు ఇలా చూడాల్సి వస్తే ఆడియెన్ పరిస్థితేమిటో! అదొక్కటే జనాల టెన్షన్!!