కరోనా సెకండ్ వేవ్ ప్రమాద తీవ్రతపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 4500 మరణాలతో దేశం అట్టుడికింది. ఈ సన్నివేశం ఊహించనిది. కోవిడ్ సోకి పలువురు సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆర్.ఎక్స్ 100 నటి పాయల్ రాజ్‌పుత్ తన సన్నిహితులలో ఒకరిని కూడా కోల్పోయారు.
ఇన్ స్టాలో ఈ విషయాన్ని వెల్లడించారు పాయల్. ప్రస్తుతం తాను ఆందోళనతో.. నిరాశతో ఉన్నానని చెప్పారు. ``నా జీవితంలో అత్యంత క్లిష్ట దశ. నాలో ఆందోళన ఉంది. నేను నిరుత్సాహపడుతున్నాను. బిగ్గరగా ఏడుస్తున్నట్టు అనిపిస్తోంది. నేను మాటలు కోల్పోతున్నాను. నాకు చాలా దగ్గరగా ఉన్న ఒకరిని నేను కోల్పోయాను. ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న అన్ని కుటుంబాలను తలచి నా హృదయం బరువెక్కుతోంది`` అని పాయల్ పేర్కొంది.
``ప్రియమైన వారిని కోల్పోయిన వారితో పోరాడుతున్న వారందరికీ నేను ప్రేమను పంపుతున్నాను. మీ ప్రియమైన వారిని మీరు వీలైనంత వరకు చూసుకుంటారు. మనం ప్రేమిస్తున్నవారిని బాగా చూసుకోవాలని గుర్తు చేయడానికి మరో సంక్షోభం అవసరం లేదని నేను ప్రార్థిస్తున్నాను`` అని సుదీర్ఘ నోట్ లో పాయల్ అన్నారు. ఈ భామ ప్రస్తుతం తెలుగు-తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది. వాటి అప్ డేట్ రావాల్సి ఉంది.