బాలీవుడ్ లో పెను దుమారం రేపుతున్న తనూశ్రీ దత్తాపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పది ఏళ్ల క్రితం ప్రముఖ నటుడు నానా పటేకర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడు, నన్ను లైంగికంగా వేదించాడు అంటూ తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యల వేడి చల్లారకముందే దర్శకుడు వివేక్ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. కొత్త హీరోయిన్ ను అయిన నన్ను అప్పట్లో పలు రకాలుగా ఆయన వేదించాడు. చివరకు నగ్నంగా డాన్స్ చేయించేందుకు ప్రయత్నించాడు అంటూ వివేక్ పై ఆరోపణలు చేసింది.
మొత్తానికి తనూశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలు రోజు రోజుకు బాలీవుడ్ లో హీట్ ను పెంచుతూనే ఉన్నాయి. ఇప్పటికే తనూశ్రీ దత్తాకు వ్యతిరేకంగా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు కళ్లు మూసుకుని ఉన్న నీవు ఇప్పుడే ఎందుకు మీడియా ముందుకు వచ్చావో అందరికి తెలుసు. పబ్లిసిటీ సంపాదించి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పలువురు స్టార్ హీరోయిన్స్ ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇప్పటికే ఈమెకు ప్రియాంక చోప్రా - ఫర్హాన్ అక్తర్ - సోనమ్ కపూర్ - కంగనా రనౌత్ వంటి వారు తనూశ్రీకి మద్దతు పలికిన విషయం తెల్సిందే. తాజాగా హీరోయిన్ పాయల్ రోహత్గీ స్పందించారు. ఈమె తనూశ్రీ దత్తాతో పలు సినిమాల్లో కలిసి వర్క్ చేయడం జరిగింది. తనూ శ్రీ చెప్పిన మాటల్లో నిజం ఉందని, ఆమెతో పాటు ఇక్కడ ఎంతో మంది లైంగికంగా వేదింపులకు గురి అవుతున్నారు అంటూ రోహత్గీ చెప్పుకొచ్చారు. నాతో కూడా కొందరు అనుచితంగా ప్రవర్తించారు. వారి విషయాన్ని బయట చెప్పడం వల్లే నా కెరీర్ ముగిసింది అంటూ రోహత్గీ పేర్కొంది. బాలీవుడ్‌తో పాటు ఈ పరిస్థితి అన్ని వుడ్‌లలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.