ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్ట్ నమోదు

Update: 2016-04-26 04:12 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ షాక్ తగిలింది. మొదటిసారిగా ఓ సినీ హీరోపై పీడీ యాక్ట్ నమోదైంది. గత నెలలో జూబ్లీ హిల్స్ లోని దసపల్లా  హోటల్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అక్కడి సిబ్బందిని బెదిరించాడనే ఆరోపణలో హీరో ఉదయ్ కిరణ్ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అతను చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు.

ఈ ఉదయ్ కిరణ్ ది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. సినీ రంగంపై ఉన్న మోజుతో ఇండస్ట్రీకి వచ్చి.. ఇక్కడ మొత్తం మూడు సినిమాలు చేశాడు. అయితే.. దురలవాట్లకు లోనై జీవితాన్ని నాశనం చేసుకున్నాడని అంటున్నారు. ఈయన తల్లి హైద్రాబాద్ లోని ఓ ప్రభుత్వాసుపత్రి లో హెడ్ నర్స్ గా పని చేస్తున్నారు. జల్సాలు - మద్యం - పబ్ లు - క్లబ్ లు - జూదం.. ఇలా అనేక ఆరోపణలు ఉదయ్ కిరణ్ పై ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే.. ఓ మహా సీరియస్ కేసులో ఇతగాడి పేరు ఉంది.

ఇప్పటికి తెలుగు రాష్ట్రాల వరకూ మొత్తం పది కేసులు ఉదయ్ కిరణ్ పై ఉన్నాయి. దాదాపు అన్నింటిలోనూ ప్రధాన నిందితుడు ఇతడే అని తెలుస్తోంది. కాకినాడ వన్ టౌన్ - టూ టౌన్ పోలీస్ స్టేషన్లలోనూ కేసలుు నమోదయ్యాయి. అందుకే ఇతనిపై పీడీ యాక్ట్(ప్రివెంటివ్ డిటెన్షన్) నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఓ సినీ హీరో ఇలా విలాసాల కోసం తన ఫ్యూచర్ ను నాశనం చేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News