బాహుబలి స్టంట్ మాస్టర్ కొత్త హిస్టరీ

Update: 2017-04-08 07:04 GMT
బాహుబలి చిత్రానికి స్టంట్స్ అందించడంలో పీటర్ హెయిన్స్ ఎంతగా కష్టపడ్డాడో.. ఎన్నేసి ట్రిక్స్ పాటించాడో దర్శకుడు రాజమౌళి చెబుతూ ఉంటే.. ఆశ్చర్యపోయి వింటూ ఉండాల్సిందే. ఒక ప్రాజెక్టు కోసం.. దర్శకుడి ఆలోచనల మేరకు సంట్స్ అందించేందుకు విపరీతంగా శ్రమిస్తాడు పీటర్ హెయిన్స్.

ఇప్పుడీయన కొత్త చరిత్ర రాసేశాడు. ఇప్పటివరకూ స్టంట్ కొరియోగ్రఫీ విభాగానికి జాతీయ అవార్డ్ ఇవ్వడం అనే ఆనవాయితీ లేదు. కానీ మొదటిసారిగా ఈ ఏడాది ఈ విభాగాన్ని ప్రవేశపెట్టగా.. 64వ నేషనల్ అవార్డ్స్ లో భాగంగా పీటర్ హెయిన్స్ కు బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ దక్కింది. మలయాళ మూవీ పులిమురుగన్ చిత్రానికి గాను.. ఈ అవార్డు దక్కించుకున్నాడీయన. తెలుగులో ఈ మూవీ మన్యం పులి పేరుతో విడుదలయ్యి మంచి విజయం సాధించింది.

ఒక అవార్డును ప్రవేశపెట్టిన తొలిసారే దక్కించుకోవడం అంటే.. కొత్త చరిత్ర రాసేసినట్లే. ఆ అవార్డు ఉన్నంతవరకూ తొలిసారి అందుకున్న వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఈయన స్టంట్స్ సమూకూర్చిన బాహుబలి ది కంక్లూజన్ విడుదలకు సిద్దమవుతోంది. గతంలో మగధీర.. రోబో.. శివాజీ.. వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు స్టంట్స్ అందించాడు పులి మురుగన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News