బాలీవుడ్ లో కరోనా సమయం లో మొదలైన పరిస్థితులు ఇప్పటికీ కూడా కుదుట పడుతున్నట్లుగా అనిపించడం లేదు. ఈ మూడే మూడు సంవత్సరాల కాలం లో బాలీవుడ్ నుండి ఒక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమా కూడా రాలేదు. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి.
ఒకటి రెండు పర్వాలేదు అన్నట్లు టాక్ దక్కించుకున్నా కూడా కలెక్షన్స్ దారుణంగా ఉంటున్నాయి. మరో వైపు తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు రెండు ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు లేడీ ఓరియెంటెడ్ హిందీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అట్టర్ ఫ్లాప్ టాక్ దక్కించుకోవడం తో కలెక్షన్స్ ఏ మాత్రం రాబట్టలేక పోతున్నాయి అంటూ సమాచారం అందుతోంది.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకున్న హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ కాలేదు, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫోన్ బూత్ అనే సినిమా తో సక్సెస్ అవ్వబోతుందని అంతా భావించారు.
ఈ సినిమా లో ఇషాన్ కట్టర్.. సిద్ధార్థ చతుర్వేది లు కీలక పాత్ర లో నటించారు. దాంతో సినిమా కు తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఎంతో మంది భావించారు. కానీ కత్రినా కైఫ్ క్రేజ్ ఏ మాత్రం ఉపయోగపడలేదు.
ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా మిలి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన హెవెన్ అనే సినిమా కు ఇది రీమేక్.
ఒరిజినల్ వర్షన్ లో ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ హిందీ డబ్బింగ్ మాత్రం నిరాశ పరిచింది. ఈ రెండు సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడం తో హిందీ ప్రేక్షకులు మరోసారి థియేటర్ల వద్ద కనిపించడం లేదు. ఈ వారం కూడా బాక్సాఫీస్ వెలవెల పోయింది. హిందీ సినిమాల పరిస్థితి మళ్లీ కుదుట పడుతుందని అనుకున్న వారికి ఈ వారం కూడా నిరాశ మిగిలింది.