కొందరి ఎంపికలు ఎంతో విలక్షణంగా ఉంటాయి. వైవిధ్యం కోసం ప్రతి నిమిషం తపిస్తుంటారు. ఇక ఇలాంటి క్వాలిటీస్ లో డాడీ కమల్ హాసన్ ని మించిపోతుంది శ్రుతి. ప్రతిసారీ ఏదో ఒక వైవిధ్యం కోసం తపిస్తూనే ఉంటుంది. ఎంపిక చేసే స్క్రిప్టు.. కాస్ట్యూమ్.. మేకప్.. యాటిట్యూడ్ ప్రతిదీ విలక్షణమే. చివరికి బోయ్ ఫ్రెండ్ ఎంపిక కూడా..!
ఇటీవల వెస్ట్రన్ మేకప్ విధానాన్ని పరిచయం చేస్తూ శ్రుతి వింతైన ఆహార్యంతో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా శ్రుతి కిరీటం ధరించిన ఫోటోషూట్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటోంది. అయితే దీనికి ఫోటోగ్రఫిక్ - ఎక్స్ రే లుక్ వింతైన మాంత్రికురాలి ఎలివేషన్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానుల్లో చర్చకు తావిచ్చాయి. వీటికి ఒరిజినల్ ఫోటోలను కూడా శ్రుతి షేర్ చేసింది.
ఇక వేరొక చిట్ చాట్ లో శ్రుతి తన మానసిక ఆరోగ్య సమస్యలపై ముచ్చటించగా చాలా ఆసక్తికర విషయాలే వెల్లడయ్యాయి. తనలోని ఒత్తిడిని తగ్గించుకునేందుకు `టాక్ థెరపీ` సహాయపడిందట. ఇంట్లో చాలా మంది ఉంటే పని చాలా ఈజీ అని తెలిపింది. ఇక కరోనా ఫీవర్ వస్తే ఏం చేయాలో కూడా శ్రుతి సూచనలిచ్చింఇ.
జ్వరం వచ్చిన మూడవ రోజు వైద్యుడి వద్దకు వెళ్లాలి. అలాగే అందరికీ మానసిక ఆరోగ్య ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వైరస్ నుండి కోలుకునే వ్యక్తుల కోసం ఆన్ లైన్ సెషన్లు చర్చా బృందాలు.. సహాయక బృందాలు ఉన్నాయి. కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ఉన్నవారి కుటుంబం లేదా ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబం కోసం ..ఒంటరితనంతో గాయాలతో ఉన్నవారికి మద్ధతు పలికే గ్రూపులు ఉన్నాయి అని శ్రుతి తెలిపారు. శ్రుతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.