ఈ అంద‌మైన జంట‌లా మ‌లైకా- అర్జున్ ఎప్పటికి?

Update: 2022-07-11 10:30 GMT
మలైకా అరోరా ఎక్క‌డ ఉన్నా అక్క‌డ వాతావ‌ర‌ణం ఆటోమెటిగ్గా హీటెక్కుతుంది. త‌న‌దైన స్టైల్ తో ఫ్యాష‌న్ ఐకాన్ గా వెలిగిపోతున్న మ‌లైకా యువ‌త‌రంలో నిరంత‌రం హాట్ టాపిక్. మల్లా (మ‌లైకా) ఒక లుక్కేస్తే చాలు యూత్ అల్ల‌క‌ల్లోల‌మే. అందుకే ఇప్పుడు న‌య‌న్- విక్కీ కొత్త జంట త‌న‌తో క‌లిసి క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

అంతేనా కొత్త జంట‌కు మ‌ల్లా త‌న‌దైన  శైలిలో ఆశీస్సులు అందించింది. న‌వ‌వధూవరులు నయనతార - విఘ్నేష్ శివన్ లను కలుసుకున్నప్పుడు స్ట్రాపీ డ్రెస్ లో మెరిసిపోయిన‌ మలైకా అరోరా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ జంట‌తో కలిసి అద్భుత‌మైన ఫోటోని షేర్ చేశారు. #మలైకానయన్విఘ్నేష్... హ్యాష్ ట్యాగ్ తో ఇది వైర‌ల్ అవుతోంది.

ఈ ఫోటోగ్రాఫ్ లో నయనతార బ్లాక్ టాప్ మిలిటరీ గ్రీన్ హై వెయిస్ట్ ప్యాంట్ లో ఎప్పటిలాగే అందంగా కనిపించగా.. విఘ్నేష్ సాధారణ దుస్తులలో కనిపించాడు. మలైకా ఈ ఫోటోకి ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది. ''అభినందనలు.. నయనతార విక్కీ... మీ ఇద్దరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది'' అని మ‌లైకా అన్నారు.

అన్న‌ట్టు అర్జున్ ని మ‌లైకా ఎప్ప‌టికి పెళ్లాడుతుంది? అన్న ప్ర‌శ్న ఇప్పుడు అభిమానుల్లో ఉద‌యించింది. న‌యన్- విఘ్నేష్ లానే మ‌లైకా-అర్జున్ జంట‌ను చూడాల‌నుకుంటున్నామ‌ని సామాజిక మాధ్య‌మాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

చాలా సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత నయనతార-విఘ్నేష్ శివన్ చివరకు జూన్ 9 న పెళ్లితో ఒక‌ట‌య్యారు. రజనీకాంత్- షారూఖ్ ఖాన్- సూర్య- విజయ్ సేతుపతి  సహా అనేక మంది స్టార్లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Tags:    

Similar News