#మాన్ సూన్ డేస్.. గొడుగులో అందాల రాణి

Update: 2022-07-14 02:30 GMT
మోడ‌ల్ కం న‌టి సిమ్ర‌న్ చౌద‌రి ఇన్ స్టా క్వీన్ గానూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఈ భామ నిరంత‌రం వరుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. ఇత‌ర భామ‌ల‌తో పోలిస్తే సిమ్ర‌న్ మ‌రీ టూమ‌చ్ గా అస‌భ్య‌త‌కు చోటు లేని విధంగా సోష‌ల్ మీడియాల్లో క‌నిపిస్తోంది. అప్ప‌డ‌ప్పుడు గ్లామ‌ర్ యాంగిల్ ని ఆవిష్క‌రిస్తున్నా హ‌ద్దు మీర‌ని ఫోటోల‌ను మాత్ర‌మే షేర్ చేస్తోంది.

తాజాగా మ‌రోసారి సిమ్ర‌న్ క్లాసీ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈసారి మెరూన్ ప‌ర్పుల్ చీర‌లో ఎంతో ల‌య‌బ‌ద్ధంగా క‌నిపించింది సిమ్ర‌న్. రుతుప‌వ‌నాల రాక‌ను స్వాగ‌తిస్తూ ఇలా చీర‌లో ఎంతో అందంగా ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చింది.

అయితే ఇంత ట్రెడిష‌న‌ల్ లుక్ లోనూ నాభి సొగ‌సును ఆవిష్క‌రిస్తూ యూత్ ని టెంప్ట్ చేస్తోంది. మ‌ల్బ‌రీ మాన్ సూన్స్ విత్ మై ఫేవ‌రెట్ కిల‌రూనెస్! అన్న వ్యాఖ్య‌ను జోడించింది. సిమ్ర‌న్ ఇచ్చిన హింట్ ని బ‌ట్టి త‌ను కేర‌ళ‌లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అలా గొడుగులో వ‌ర్షాకాలం షికార్ చేస్తోంద‌న్న‌మాట‌. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.  #మాన్ సూన్ డేస్.. గొడుగులో అందాల రాణి.. అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.

నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో హర్ష్ కనుమిల్లి హీరోగా న‌టించిన సెహ‌రిలో సిమ్రాన్ చౌదరి నాయిక‌గా న‌టించింది. గందరగోళంలో ఉన్న వ్యక్తి రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెర‌కెక్కింది.

క్రేజీ రొమాం-కామ్ లో సిమ్ర‌న్ ముగ్గురు నాయిక‌ల్లో ఒక‌రిగా క‌నిపించింది. ఈ చిత్రానికి హీరో హర్ష్ కనుమిల్లి రచ‌యిత‌. తాను క‌లిసిన‌ ప్రతి అమ్మాయికి పడిపోయే కుర్రాడిగా అత‌డు న‌టిస్తే.. సిమ్రాన్ చౌదరి పాత్రతో క‌న్ క్లూజ‌న్ ల‌భిస్తుంది. సిమ్ర‌న్ త‌దుప‌రి వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది.
Tags:    

Similar News