పిక్ టాక్ : జిమ్‌ నుండి వస్తూ మినీ షార్ట్ లో మతి పోగొడుతోంది

Update: 2022-09-13 23:30 GMT
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు రియా చక్రవర్తి. తెలుగు లో తూనీగ తూనీగ సినిమా లో నటించి మళ్లీ కనిపించకుండా పోయిన ముద్దుగుమ్మ బాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్న సమయంలో అనూహ్యంగా డ్రగ్స్ కేసు మరియు సుశాంత్ సింగ్ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య కేసు కారణంగా ఆమె కెరీర్‌ గందరగోళంలో పడ్డట్లు అయ్యింది.

దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆమె కనిపించకుండా పోయింది. మళ్లీ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ద్వారా రియా చక్రవర్తి సందడి చేస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌ లో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇదే సమయంలో తన అందాల విందు ఫోటో షూట్స్ తో ఈ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉంది.

తాజాగా ముంబయిలోని ఒక జిమ్‌ వద్ద వర్కౌట్స్ చేస్తూ బయటకు వెళ్తూ ఇలా కనిపించింది. స్నేహితులతో ఆమె బయటకు వెళ్తూ మీడియా కంట పడింది. మినీ పింక్ షార్ట్‌ మరియు బ్లాక్ టాప్ లో రియా చక్రవర్తి చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అక్కడున్న వారు తమ కెమెరాలకు పని చెప్పారు. అలా ఈ అమ్మడి నాచురల్‌ అందం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జిమ్‌ లో నుండి వస్తున్న సమయంలో కూడా ఇంత ఫ్రెష్ గా ఇంత అందంగా ఏ మాత్రం అలసిపోయినట్లుగా లేదు అంటూ కొందరు ఈమెను తెగ ప్రశంసిస్తున్నారు.

ఇదే సమయంలో మేకప్‌ లేకుండా కూడా రియా ఇంత అందంగా ఉండి మతి పోగొడుతుంది అంటున్నారు. మళ్లీ ఈ అమ్మడు బాలీవుడ్‌ లో బిజీ అయ్యే రోజులు ముందు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News