బుజ్జీ.. మరీ ఇంత బక్కచిక్కిపోతే ఎలా?

Update: 2022-01-07 05:36 GMT
ఓకే అనిపించేంత బొద్దుతనంలో ఉన్న అందమే అందం. కానీ.. ఇప్పుడంతా స్లిమ్ గా.. స్లీక్ గా ఉండటమే అందానికి పరమార్థంగా ఫీల్ అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఒకప్పుడు బక్కపల్చగా ఉన్నోళ్లను చూసి.. అనరాని మాటలు అనేవారు. కాస్తంత బొద్దుగా లేకుంటే అందం ఏముందనే వాళ్లు. ఇప్పుడంతా సైజ్ జీరో చుట్టూ గ్లామర్ ఇండస్ట్రీ నడుస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. రన్ రాజా రన్ మూవీతో పరిచయమైన సీరత్ కపూర్ గుర్తుందా?

అదేనండి.. ‘బుజ్జి మా.. బుజ్జి మా’ పాటతో పాపులర్ అయిపోయి.. ఆ సినిమా తర్వాత బోలెడన్ని అవకాశాల్ని కొల్లగొడుతుందన్న అంచనాల్నిసొంతం చేసుకున్నప్పటికీ.. అందుకు భిన్నంగా పెద్దగా అవకాశాల్ని దక్కించుకోలేని అమ్మడు సౌత్ లో పాగా వేయలేకపోయింది. రన్ రాజా రన్ తర్వాత నాగ్ ‘రాజుగారి గది 2’లో గ్లామర్ చిందించినా ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు.

కట్ చేస్తే.. అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీ వైపు ఆమె రాలేదు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా పోస్టు చేసిన ఫోటోను చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. రన్ రాజా రన్ మూవీలో కాస్తంత బొద్దుగా ఉన్న ఈ బుజ్జి.. తాజాగా ఫోటోను చూస్తే.. మరీ ఇంత బక్కపల్చగా తయారైందన్న భావన కలుగక మానదు. ఒకప్పుడు హాటీగా ఉన్న సీరత్.. ఇప్పుడు స్లీక్ అయిపోయిన వైనం ఆమె అభిమానులకు నచ్చట్లేదు. స్లిమ్ కావటం తప్పు కాదు కానీ.. ఉన్న అందం మిస్ అయ్యే బక్కపల్చనితనం అవసరమా? అని అడుగుతున్నారు. సన్నజాజితో పోటీ పడుతున్న ఈ బ్యూటీ.. ఇక్కడితో అయినా ఆగితే బెటర్ అన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News