సౌత్ లో ఇంటి పేరుగా మారిన బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్ దాదాపుగా హాటెస్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది పాశ్చాత్య లేదా సంప్రదాయ చీర లేదా బికినీ లుక్ ఏదైనా సంథింగ్ హాట్ అన్న ప్రశంస అందుకుంది. శ్రద్ధ ఎలాంటి వేషధారణలోనైనా అందంగా కనిపిస్తుంది. ఇటీవల బెంగాలీ చిత్రం జీత్ లో చివరిగా కనిపించిన శ్రద్ధా దాస్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో హాటెస్ట్ ఫోటోషూ్ ని షేర్ చేసింది. అది క్షణాల్లో వైరల్గా మారింది. 2022 కి వెల్ కం చెబుతూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం శ్రద్ధా ఇలా బీచ్ రిసార్ట్ లో వెకేషన్ కి వెళ్లింది. ఈ కొత్త సంవత్సరం ఫియర్ లెస్ గా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంది. మనలోంచి బ్రాండ్ న్యూ వెర్షన్ బయటికి రావాలని .. నెగెటివిటీ మొత్తం పోవాలని ఆకాంక్షించింది. గోవాలోని ఆక్సిజన్ రిసార్ట్ లో శ్రద్ధా ఫుల్ గా చిలౌట్ చేసానని వెల్లడించింది.
ప్రతిసారీ కొత్త సంవత్సర వేడుకలు అంటే యూత్ క్లబ్స్ లో లేదా ఔటర్ లో స్పెషల్ ఈవెంట్ల పేరుతో భారీగా ఆర్జించే శ్రద్ధా దాస్ ఈసారి మాత్రం గోవాలో డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఈ విజిట్ లో తనతో పాటే స్నేహితులు ఎవరున్నారన్నది తెలియరాలేదు.
ఒక దశాబ్దం పాటు సుధీర్ఘ కెరీర్ లో శ్రద్ధా తెలుగు-ఇంగ్లీష్- హిందీ- బెంగాలీ- కన్నడ- తెలుగు సహా పలు భాషల్లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కథానాయికగా నటించింది. ఇటీవలి కాలంలో శ్రద్ధా గుంటూరోడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించింది. కానీ ఆశించిన బిగ్ బ్రేక్ అయితే రావడం లేదు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకున్నా.. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఆమె గ్లామర్ రంగంలో నెమ్మదిగా ఎదిగింది. తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఆదాయం .. మోడలింగ్ ద్వారా ఆర్జిస్తోంది.