కమల్ హాసన్ నటించిన 'విక్రమ్', అడివి శేష్ నటించిన 'మేజర్' సినిమాల తరువాత బాక్సాఫీస్ వద్ద దాదాపు రెండు నెలలుగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ని సంతం చేసుకోలేకపోయాయి. ప్రత్యేకంగా జూన్, జూలై నెలల్లో విడుదలైన తెలుగు సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుల్ని చూశాయి. దీంతో తెలుగు సినిమా పరిస్థితి ఏంటీ? ..ఇక థియేటర్లలో సినిమాలు ఆడవా? .. ప్రేక్షకులు సినిమలు చూడటానికి థియేటర్లకు రారా? అనే ఆందోళ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 5న విడుదలైన రెండు సినిమాలు బింబిసార, సీతారామం టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోశాయి. కంటెంట్ వున్న సినిమాల కోసం ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మరోసారి నిరూపించి ఇండస్ట్రీకి కొండంత ధైర్యాన్నిచ్చాయి. నందమూకి కల్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ ఫిక్షల్ మూవీ 'బింబిసార' ఆగస్టు 5న విడుదలై మాస్ ఆడియన్స్ ని ఆట్టుకుంటూ భారీ విజయం దిశగా పనిస్తోంది. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఇక దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'సీతారామం' ఇదే రోజు విడుదలై క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ప్రేమకథా చిత్రాల్లో క్లాసిక్ ని ప్రశంసలు అందుకుంటోంది. రోజు రోజుకీ ఈ రెండు సినిమాల కలెక్షన్స్ తో పాటు ప్రేక్షకాదరణ పెరుగుతుండటం విశేషం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల తరువాత ఆగస్టు 12, 13న విడుదలవుతున్న సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ఆగస్టు 12న నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజక వర్గం' విడుదల కాబోతోంది. కొత్త దర్శకుడు ఎం.ఎస్. రాజశూఖరరెడ్డి తెరకెక్కించాడు. హైవోల్టేజ్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా నిర్మించిన ఈ మూవీ సక్సెస్ నితిన్ కెరీర్ కి అత్యంత కీలకంగా మారింది. రంగ్ దే, మాస్ట్రో వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లని అందించడంతో నితిన్ ఆశలన్నీ 'మాచర్ల ..' పైనే పెట్టుకున్నాడు. క రకంగా చెప్పాలంటే ఈ మూవీ తనకు యాసిడ్ టెస్ట్ లా భావించవచ్చు.
సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఫైనల ఫలితం మాత్రం ఆగస్టు 12న రానున్న నేపథ్యంలో యూనిట్ తో పాటు హీరోలోనూ టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. ఈ గండంని నితిన్ గట్టెక్కుతాడా? అన్నది తెలియాలంటే ఆగస్టు 12 ఉతయం మొదలి ఆట వరకు వేచి చూడాల్సిందే. ఇక ఆగస్టు 13న యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 2'లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ ఫిల్మ్ 'కార్తికేయ'కు సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై బంచి ఎక్స్ పెక్టేషనప్స్ వున్నాయి.
రెండు మూడు దఫాలుగా రిలీజ్ వాయిదాపడుతూ వస్తున్న ఈమూవీ సెంటిమెంట్ ప్రకారం నిఖిల్ కు సూపర్ హిట్ ని అందిస్తుందని యూనిట్ భావిస్తోంది. ఆది ఆగస్టు 13న రిపీట్ అవుతుందా అన్నది తెలియాలంటే మొదటి షో వరకు వేచి చూడాల్సిందే. ఈ రెండు సినిమాల మధ్య బాలీవుడ్ కు చెందిన రెండు సినిమాలు ఆగస్టు 11న పోటీకి దిగుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ నటించిన 'రక్షా బంధన్'. ఈ రెండింటిని తట్టుకుని 'బింబిసార', సీతారామం' అందించిన సక్సెస్ ని నితిన్, నిఖిల్ కంటిన్యూ చేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.