ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని శనివారం రాత్రి ఒక యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న కొత్త కారును యాక్సిడెంట్ చేసిన ఆమెపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే.. ఈ ఇష్యూను కేసులు గట్రా లేకుండా సెటిల్ చేసుకుందామని రాజశేఖర్ ఫ్యామిలీ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు భిన్నంగా తాజాగా పోలీసులు శివానిపై కేసు నమోదుచేశారు.
శనివారం రాత్రి వేగంగా కారు నడిపిన శివాని.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 73 నుంచి నవనిర్మాణనగర్ వైపు తన కారులో వెళుతున్నారు. ఈ క్రమంలో అక్కడున్న స్పీడ్ బ్రేకర్ ను దాటే క్రమంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న కొత్త కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు యజమాని తనకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొత్త కారు కావటంతో.. కారు మొత్తం అమౌంట్ ఇవ్వాలని కోరారు. శివాని గుద్దిన కారు బాగా డ్యామేజ్ అయినట్లుగా చెబుతున్నారు.
కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసినా.. నష్టపరిహారం విషయంలో ఇరువురి మధ్య రాజీ కుదరకపోవటంతో ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ ను పోలీసులు నమోదుచేశారు. ఎస్‌పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ కు చెందిన కారును శివాని గుద్దారు. ఆదివారం శివాని మీద కేసు ఫైల్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.