తమిళనాట సినిమాలు వివాదం అవ్వడం కొత్తేం కాదు. అక్కడ తెరకెక్కే ఎక్కువ శాతం సినిమాలు ఏదో ఒక వివాదంను మూట కట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా తమిళనాట సర్కార్ చిత్రం ఏ స్థాయి వివాదాన్ని రేపిందో చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో దర్శకుడు విజయ్ అమ్మ జయలలితను అవమానించాడు అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే మరో తమిళ సినిమా చిక్కుల్లో పడినది, ఆ వివాదం కారణంగా హీరోయిన్ హన్సికపై ఏకంగా పోలీసు కేసు నమోదు అయ్యింది.
హన్సిక ప్రధాన పాత్రలో జమీల్ దర్వకత్వంలో రూపొందిన చిత్రం ‘మహా’. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దం అయిన ఈ సినిమా నుండి తాజాగా ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ లో సింహాసనంపై హన్సిక సాధువు వేశంలో కూర్చుని ఉంది. అడ్డ దిడ్డంగా కూర్చుని పొగ తాగుతూ ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం వివాదాన్ని మొదలు పెట్టింది.
ఆ ఫొటో సాధువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ తమిళనాడుకు చెందిన పట్టలి మక్కల్ కచ్చి పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హిందూ సమాజంపై దాడి వంటిది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే హీరోయిన్ హన్సిక మరియు జమీల్ లు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ సీన్ ను సినిమాలో లేకుండా తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ సమాజంను అవమానించేలా ప్రవర్తించేలా ఒక్క సీన్ ఉన్నా కూడా సినిమాను ఆడనివ్వబోం అంటూ వారు హెచ్చరిస్తున్నారు.