తిరుమల శ్రీవారి రథసప్తమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సమయంలో జరిగిన ఓ సంఘటన దుమారం రేపుతోంది. తిరుమల మాడ వీధుల్లో శ్రీవారి ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొందరు కెమేరామెన్ షూటింగ్ తీయడం వివాదాస్పదం అయింది. మాడ వీధులు, ప్రధాన కోవెలను చిత్రీకరించడం చట్టరీత్యా నేరం. అందుకే.. వీరు రహస్యంగా 5డీ కెమేరాలతో షూటింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అయితే.. పోలీసుల విచారణలో వీరంతా తాము మహేష్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్ర యూనిట్ కి చెందిన వారమని, సినిమా కోసమే ఇలా చిత్రీకరిస్తున్నామని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అయితే అసలు ముందుగా పర్మిషన్ లేకుండా ఎలా షూటింగ్ చేస్తారనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం రాలేదు. అసలు సినిమాల కోసం షూటింగ్స్ చేసేందుకు తిరుమలలో అనుమతి ఇచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.
వీరు బ్రహ్మోత్సవం సినిమా యూనిట్ కెమేరామెన్ అని చెప్పుకుంటున్నట్లు.. కొన్ని తెలంగాణ ఛానల్స్ లో, పత్రికల్లో వార్తలు వచ్చాయి కూడా. అయితే.. అసలు వీరు ఆ సినిమా యూనిట్ వారేనా కాదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా కాకపోతే ఎందుకు శ్రీవారి ఊరేగింపు చేస్తున్నారు, సినిమా కోసం అయితే ఇలా ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.