బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. పఠాన్ సినిమాలోని దీపికా పదుకునే బికినీ వివాదాస్పదం అయ్యింది. హిందూ సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. పలు థియేటర్లలో పఠాన్ సినిమా యొక్క పోస్టర్స్ ను తొలగించడం.. తగులబెట్టడం.. కాలితో తన్నడం వంటివి చేశారు. ముఖ్యంగా గుజరాత్ లో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
పఠాన్ సినిమా యొక్క వివాదం నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25వ తారీకున విడుదల కాబోతున్న పఠాన్ సినిమా లు ప్రదర్శింపబడే ప్రతి ఒక్క థియేటర్ వద్ద పోలీసుల పహారా కాయాల్సిందిగా పేర్కొన్నారు. థియేటర్ వద్ద ఎవరైనా ఆందోళన చేసినా లేదంటే థియేటర్ లోపల ఏమైనా ఆందోళన చేసినా కూడా అరెస్ట్ చేయబోతున్నట్లుగా గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ యొక్క కార్యకర్త సమావేశంలో మంత్రుల నుండి కార్యకర్తల వరకు అందరితో మాట్లాడుతూ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీ వారిని ఇబ్బంది పెట్టవద్దు అన్నట్లుగా సూచించారు అంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులు పఠాన్ సినిమాపై గత కొన్నాళ్లుగా చేస్తున్న ఆందోళనను విరమించుకోవడం జరిగిందట. దేశవ్యాప్తంగా పఠాన్ సినిమా కు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో చిత్ర యూనిట్ సభ్యులు సినిమా థియేటర్లకు భద్రత కోరుతున్నారు.
మొత్తానికి పఠాన్ లోని దీపిక పదుకునే బికినీ కి సెన్సార్ కత్తిరింపు పడ్డా కూడా పోలీసులు మాత్రం భారీగానే థియేటర్ల వద్ద పహారా కాస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పఠాన్ సినిమా తో షారుఖ్ ఖాన్ సక్సెస్ దక్కించుకుంటాడా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.