హీరో శ్రీకాంత్ అనేక రకాల రోల్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. పోలీస్ పాత్ర కూడా శ్రీకాంత్ కి కొట్టిన పిండే. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా అనే సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడో సినిమాకి సంబంధించి పోలీస్ పాత్ర కారణంగా.. లీగల్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. వీటిని ఇచ్చింది కూడా పోలీసులే కావడం విశేషం.
మెంటల్ పోలీస్ అనే సినిమాలో పోలీసులను తప్పుడుకోణంలోంచి చూపించారని.. పోలీస్ పాత్రను అవమానించాడంటూ.. శ్రీకాంత్ కు లీగల్ నోటీసు జారీ అయింది. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ నే అవమానపరిచాడన్నది పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ హైద్రాబాద్ ఇచ్చిన నోటీసు సారాంశం.
మెంటల్ పోలీస్ మూవీ ట్రైలర్ కొన్ని నెలల క్రితం రిలీజ్ అయ్యింది. ఇందులో హీరో శ్రీకాంత్ మెడలో చెప్పుల దండ వేసుకుని రోడ్డుపై కూర్చుని కనిపిస్తాడు. అక్ష హీరోయిన్ గా నటించిన మెంటల్ పోలీస్.. కరణం పి బాబ్జీ దర్శకత్వంలో రూపొందింది. ఈ పాత్రకు సంబంధించి జారీ అయిన నోటీసుకు.. ఇప్పుడు శ్రీకాంత్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.