బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలకమైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించారు. తాజాగా అతడి డిప్రెషన్ కు వైద్యం చేసిన నలుగురు వైద్యులను విచారించి కీలక సమాచారం రాబట్టారు.
అలాగే ఈ కేసులో సుశాంత్ కు అవకాశాలు ఇచ్చి తీసేసిన బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇక తాజాగా యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను కూడా విచారణకు పిలిచారు. ఇక్కడే దొంగ దొరికాడని తెలిసింది.
సంజయ్ లీలా భన్సాలీ చెప్పిన దానికి ఆయనతో సినిమాలు నిర్మించిన నిర్మాత ఆదిత్య చోప్రా చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ‘భాజీ రావ్ మస్తానీ.. రామ్ లీల, పద్మావత్’ సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదని భన్సాలీ పేర్కొనగా.. ఆ సినిమాలు తీసిన ఆదిత్య చోప్రా మాత్రం సుశాంత్ ను తీసుకుందామని భన్సాలీ తనతో చెప్పలేదని చెప్పడం గమనార్హం. వీరిద్దరి స్టేట్ మెంట్స్ వేరు వేరుగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
ఇక సుశాంత్ సింగ్ సినిమాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటూ సినీ జర్నలిస్టు, క్రిటిక్ రాజీవ్ మసంద్ పై ఆరోపణలు రావడం.. కంగనా రౌనత్, మనోజ్ బాజ్ పాయి.. అపూర్వ అస్రానీ లాంటి బాలీవుడ్ ప్రముఖులు రాజీవ్ పై విమర్శలు చేయడంతో అతడిని పోలీసులు జూన్ 21న విచారించారు. అతడి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. రాజీవ్ తన రాతలతో సుశాంత్ సింగ్ ను మానసికంగా కృంగదీశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఇలా సుశాంత్ సింగ్ కేసు అమిత్ షా. మోడీ వరకు వెళ్లడం.. బీజేపీ ఎంపీల సీబీఐ డిమాండ్ తో బాలీవుడ్ లో సినీ మాఫియా డొంక కదులుతోంది.