అందుకే నయనతారకు నా సపోర్ట్: ధనుష్ హీరోయిన్

ఇటీవల ధనుష్ - నయనతారల వివాదం సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-26 05:47 GMT

ఇటీవల ధనుష్ - నయనతారల వివాదం సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ధనుష్ ను ఉద్దేశిస్తూ నయన్ తీవ్ర విమర్శలు చేస్తూ ఓపెన్ లెటర్ రాయడం కొన్ని రోజుల పాటు మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది. ఈ విషయంలో పలువురు హీరోయిన్లు నయనతారకు మద్దతు తెలిపారు. వారిలో నటి పార్వతి తిరువోతు కూడా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నయన్ లేఖను పంచుకోవడం ద్వారా మద్దతు ప్రకటించింది. అయితే ఈ ఇష్యూలో నయన్‌కు ఎందుకు సపోర్ట్ చేసిందో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

"నయనతారకు మద్దతు తెలపడం లాంగ్ ప్రాసెస్ ఏమీ కాదు. ఒక స్టాండ్ తీసుకోవడానికి, నా మద్దతును అందించడానికి నాకు అదనపు సమయం అవసరం లేదు. ఆమె పోస్ట్ చూసిన వెంటనే షేర్ చేయాలని అనిపించింది. ఎందుకంటే నయనతార సెల్ఫ్ మేడ్ ఉమెన్, లేడీ సూపర్ స్టార్. తన కెరీర్‌ను తానే నిర్మించుకున్న నయన్ ఇలా బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది. ఆమె కారణం లేకుండా మాట్లాడే వ్యక్తి కాదనే విషయం మనందరికీ తెలుసు" అని పార్వతి తిరువోతు చెప్పింది.

"నయన్ తను ఎదుర్కొన్న అనుభవాలను మూడు పేజీలలో రాసింది. అందుకే దానిని బహిరంగ లేఖ అని పిలుస్తున్నాం. ఆమెకు మద్దతు ఇవ్వాలి అని నాకు అనిపించింది. ఇది నిజమైన సమస్య. నయనతారకు మద్దతు ఇస్తున్న వారందరూ ఆమె లేఖలోని నిజాన్ని నమ్ముతున్నారు. ఏదో ఒక సందర్భంలో మనమందరం ఇతరులలో మనల్ని చూసుకుంటాం. ఒక వ్యక్తికి ఎవరూ అండగా నిలవకపోతే ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు. ఇది కూడా ఒక కారణం. సపోర్ట్ అనేది ఒక వ్యక్తిని ఎంతగా మారుస్తుందనేది కూడా నాకు తెలుసు. ఆ విధంగా ఆలోచిస్తే, నేను ఎల్లప్పుడూ అలాంటి వ్యక్తుల కోసం నిలబడతాను. ముఖ్యంగా వారు స్త్రీలు అయితే మద్దతు ఇవ్వడంలో ముందే ఉంటాను'' అని పార్వతి చెప్పుకొచ్చింది.

మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు 2013లో ధనుష్ తో కలిసి 'మరియాన్' అనే మూవీలో నటించింది. అయితే ఈ వివాదంలో ధనుష్ కు కాకుండా నయనతారకు సపోర్టు చేయడం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ధనుష్ తో కలిసి నటించిన శృతి హాసన్, నజ్రియా నజీమ్, ఐశ్వర్య లక్ష్మి, అనుపమ పరమేశ్వరన్‌, ఐశ్వర్య రాజేష్‌, గౌరీ జి కిషన్ వంటి మరికొందరు హీరోయిన్లు సైతం ఈ వ్యవహారంలో అతనికి వ్యతిరేకంగా నయన్ కు మద్దతు తెలపడం గమనార్హం. అయితే ఈ కాంట్రవర్సీలో ధనుష్ కు పెద్ద ఎత్తున సినీ అభిమానుల సపోర్ట్ లభించింది.

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ విషయంలోనే ధనుష్, నయన్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. 'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమాకు సంబంధించిన 3 సెకన్ల బీటీఎస్ వీడియో క్లిప్ ను డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం డైమండ్ చేస్తూ నిర్మాత ధనుష్ తనకు లీగల్ నోటీసులు పంపించినట్లు నయనతార లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో ధనుష్ వ్యక్తిత్వం గురించి తీవ్రమైన విమర్శలు చేసింది. దీనిపై ధనుష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. లీగల్ గానే ఈ వివాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News