#మీటూ: నాకు తప్పలేదన్న పూజా భట్

Update: 2018-10-07 13:19 GMT
తనుశ్రీ ఎపిసోడ్ హాట్ టాపిక్ కావడంతో మళ్ళీ ఇండియాలో మరోసారి #మీటూ కాంపెయిన్ ఊపందుకుంది.  కోల్‌ కతాలో జరిగిన 'ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్ 2018' లో పాల్గొన్న పూజా భట్ తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించింది. కొన్ని సార్లు శత్రువు పక్కనే ఉంటాడని.. వేధింపులకు పాల్పడే వారు మీ స్నేహితులు కూడా అయి ఉండొచ్చని.. అందుకే మహిళలు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ఒకసారి ఎయిర్ పోర్ట్ లో ఉన్నప్పుడు తన స్నేహితుడే పూజాను వేధించాడట. "నేనసలు ఊహించలేదు. అతడు నన్ను వేధిస్తూ నా బ్రెస్ట్ పట్టుకున్నాడు.ఆ సమయంలో నేను ఎంతో మనోవేదనకు గురయ్యాను"  అని చెప్పుకొచ్చింది.  బాలీవుడ్ లో ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు చాలామంది సపోర్ట్ ఇవ్వరని.. అలా అని భయపడొద్దని.. నిర్భయంగా వారిపై పోరాటం చేయాలని పిలుపిచ్చింది.  అలా మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి పోరాటం చేస్తేనే మగాళ్ళు తప్పు చేయడానికి భయపడతారని చెప్పింది.

తనకెదురైన ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి గురించి వివరిస్తూ.. ఒకసారి తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు అతడు వేధించాడట.  అప్పుడు అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే తన చుట్టూ ఉండేవారి లో కొందరు పూజనే తప్పు పట్టారట..  "అది నీ పర్సనల్ విషయం..పబ్లిక్ లోకి ఎందుకు తీసుకొస్తున్నావు" అని అన్నారట.

తనుశ్రీ ఎపిసోడ్ తర్వాత నెమ్మదిగా ఇతర సెలబ్రిటీలు తమకెదురైన వేధింపుల గురించి వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News