హీరోయిన్లకు పిల్లలపై అంత ప్రేముందా?

Update: 2017-10-14 09:50 GMT
స్టైలిష్ స్టార్ మూవీ డీజే దువ్వాడ జగన్నాధం ద్వారా అటు బన్నీని.. ఇటు జనాలను తెగ కవ్వించేసిన బ్యూటీ పూజా హెగ్డే. ఆ సినిమాలో మోగించిన అందాల మోతకు.. ఈమెకు టాలీవుడ్ గులాం అయిపోయింది. భారీ రెమ్యూనరేషన్ తో పెద్ద పెద్ద ఆఫర్స్ నే అందించేస్తోంది.

నిన్న అంటే అక్టోబర్ 13న అందాల సుందరాంగి పూజా హెగ్డే తన పుట్టిన రోజును జరుపుకుంది. 27 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ.. తన బర్త్ డేను చిన్నారుల మధ్యన జరుపుకుని ప్రత్యేకతను చాటుకుంది. స్మైల్ ఫౌండేషన్ కు చెందిన పిల్లలతో కలిసి ఇలా బర్త్ డే చేసుకోవడం చూసేందుకు ముచ్చటగానే ఉంది. ఈమె మాత్రమే కాదు.. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా అచ్చం ఇలాగే చేసింది. చిన్ని చిన్ని పిల్లలతో తన పుట్టిన రోజు కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసింది.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ పిల్లలతో బర్త్ డే చేసుకోవడం అనే కాన్సెప్ట్ లో నిజమైన ప్రేమ ఎంత ఉందనే ప్రశ్నకే సమాధానం చెప్పడం కష్టం. ఆయా స్టార్లు పుట్టిన రోజున పుట్టినంత ప్రేమ ఆ తర్వాతెప్పుడూ మళ్లీ కనిపించడం లేదు. గుప్త దానాలు చేసి ఉంటారులే అని సరిపెట్టుకోవడం తేలికే కానీ.. కేక్ కట్ చేసిన దానికే ఇంత ప్రచారం చేసుకుంటున్న వారు.. నిజంగా డొనేషన్స్ ఇచ్చి ఉంటే.. దాన్ని మరింతగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా.
Tags:    

Similar News