లాక్ డౌన్ నేపథ్యంలో సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా స్వీయ దిగ్భంధనంలో ఉండిపోయారు. ఆ క్రమంలోనే ఇంటి పనులు ఒంట పట్టించుకుని చాలానే చేస్తున్నారు. చెమటలెక్కేలా ఒంటికి పని చెబుతున్నారు. షూటింగ్ సమయంలో బయట ఫుడ్ తిని బొర్ కొట్టేసినా పలువురు ఇళ్లలోనే గరిట తిప్పడం మొదలు పెట్టారు. చెఫ్ మాష్టర్లు గా అవతారం ఎత్తి ఇష్టమైన వంటకాలు రెడీ చేసుకుని తృప్తిగా ఆరగిస్తున్నారు. ఎలాగూ ఇంకొన్ని రోజుల పాటు షూటింగ్ లు ఉండవు కాబట్టి డైట్ లు అవి పక్కన బెట్టేసి రకరకాల వంటకాల్ని ఆస్వాధిస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి.. సుమ లాంటి యాంకర్లు అంతా హైదరాబాద్ దమ్ బిరియానీ ట్రై చేసారు. వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి లాక్ డౌన్ స్పెషల్ అంటూ ప్రచారం చేసుకున్నారు.
తాజాగా ముంబై భామ.. బుట్టబొమ్మ పూజా హెగ్డే అలానే ఇంట్లో ఓ కొత్త రెసిపీని ట్రై చేసింది. సండే స్పెషల్ గా కిచెన్ కి వెళ్లి గరిట తిప్పేసింది. నిన్నంతా రకరకాల రుచుల్ని టేస్ట్ చేసిందట. ఆ వంటాకన్ని ఇలా ఇన్ స్టాలో పోస్ట్ చేసిందో లేదో ఫ్యాన్స్ లోకి ఫోటోలు దూసుకెళ్లాయి. కిచెన్ లో ఇదిగో ఇలా వయ్యారంగా కాలుపై కాలేసుకుని మరీ వంటకాల్ని రెడీ చేస్తోంది. గరిట పట్టి తెగ తిప్పేస్తుంది. ఇంతకీ ఆ వంటకం ఏంటో అమ్మడే చెప్పాలి. అలాగే ఇది టిఫినా.. లంచా.. డిన్నరా అన్నది తనే చెప్పాల్సి ఉంది. పసుపు రంగు టాప్ పిక్కలపైకి పొట్టి డెనిమ్ ధరించి థౌ సొగసుల్ని వండి వార్చింది. ఆమె వంటకాల సంగతేమో కానీ కుర్రకారు మాత్రం వేరే థై రుచుల్ని ఆరగిస్తున్నారు. ఈ వంటకం థాయ్ వంటకాల్ని మించిపోయిందే అనేంతగా ఆరగించారు మరి.
ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్ లో పూజా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటలీ- యూరప్ లో కీలక షెడ్యూల్ ని చిత్రీకరించారు. అయితే ఇంకా షెడ్యూల్ కొంత భాగం పూర్తిచేయాల్సి ఉంది. ఈలోగా కరోనా వైరస్ విజృంభణతో ఇటలీ ఒణికిపోయింది. అనూహ్యంగా వేలాది మరణాలు సంభంచించాయి. ఆ క్రమంలోనే ప్రభాస్ - పూజా టీమ్ విదేశాల నుంచి ఇండియాకి రిటర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ సెల్ఫ్ క్వారంటైన్ నియమం పాటించారు ఆ ఇద్దరూ. ఇండియాలో కరోనా లాక్ డౌన్ సన్నివేశంలో ఎవరికి వారు ఇండ్లలోనే జిమ్ చేస్తూ రొటీన్ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు.