అయ్యో.. పూజా హెగ్డేని దోమ కుట్టిందట!

Update: 2016-07-25 10:51 GMT
2010 మిస్ యూనివర్స్ పోటీలో సెకండ్ రన్నర్ అప్ గా ఎంపికై మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన మాస్క్ తో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది పూజా హెగ్డే. ఇంకా బాగా గుర్తురావాలంటే.. ముకుంద సినిమాలో వరుణ్ తేజ సరసనా, ఒక లైలా కోసంలో చైతూ పక్కన నటించిన ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బామని దోమ కుట్టిందనేది తాజా సమాచారం. అది ప్రేమదోమ కాదు, మరేదోమా కాదు... సామాన్యులకు అతిచేరువైన దోమ.. నిజం దోమ! కాకపోతే దానికున్న స్పెషల్ పేరు డెంగ్యూ దోమ! దానికి సామాన్యులు - సెలబ్రెటీలు అనే తేడా ఏమీ ఉండదు కదా మరి.

అవును.. పూజా హెగ్డే ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. దీంతో పూజా తన తదుపరి చిత్రం మొహెంజొదారో సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరుకాలేకపోతుందట. ఈ పరిస్థితుల్లో సినిమా యూనిట్ కూడా ఆమెకు బాగానే సహకరిస్తున్నారట. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కాబోతుంది.
Tags:    

Similar News