ముంబై బ్యూటీ పూజా ఫోజులు చూస్తుంటే.. పిజ్జా కావాలా? పూజా కావాలా? అని కవ్వించినట్టే ఉంది కదూ? ఒకవేళ ఆ రెండిటిలో ఏది మీ ఆప్షన్? అంటే కుర్రకారు ఓటు రెండోదానికే. తనవైన అందచందాలతో పూజా హెగ్డే తెలుగు యువతను ఎప్పుడో బుట్టలో వేసింది. నాగచైతన్య - వరుణ్ తేజ్ లాంటి యువహీరోల సరసన నటించిన ఈ అమ్మడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ - ఎన్టీఆర్ - ప్రభాస్ లాంటి స్టార్ల సరసన అవకాశం అందుకుంది. మహేష్ 25 - ఎన్టీఆర్ చిత్రాలు శరవేగంగా పూర్తవుతున్నాయ్. ఈ రెండిటికి పూజా గ్లామర్ పెద్ద అస్సెట్ కానుంది. తదుపరి ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళుతోంది కాబట్టి పూజా అటు ఇటు లొకేషన్లకు పరుగులు పెట్టనుంది.
అదంతా సరే.. ఈ ఫోటోలో పూజా ఇలా పిజ్జాలు అమ్ముతోందేంటో? అలా యూత్ కి పిజ్జా చూపించి ఊరిస్తోంది. ఇదిగో ఎంచక్కా లాగించేస్తున్నా.. మీక్కూడా కావాలా? అంటూ ఎలా బుంగమూతి పెట్టిందో. అలా కవ్వించి కితకితలు పెడితే కుర్రాళ్లు ఊరుకుంటారా? ఆ పిజ్జా మాక్కూడా కావాలి? పూజా కూడా కావాలి! అంటూ వెంటపడకుండా ఉంటారా? ఒకసారి వెంటపడ్డాక ఆశ దోశ అప్పడం వడ! అంటే కుదరదిక.
అసలింతకీ ఈ ఫోజు ఇచ్చిందెక్కడో కానీ.. తాను పిజ్జాని ప్రిపేర్ చేస్తే ఇలా డ్రెసప్ చేస్తానని చెప్పింది. అంతేనా.. ఇదే నా సీరియస్ బిజినెస్.. రెడ్ కార్పెట్ ఫుడ్.. ఆకలితోనే ఆరోగ్యం.. ఫుడ్ ఈజ్ లైప్! అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్ ని పోస్ట్ చేసింది. పిజ్జాపై కరివేపను దండీగా దట్టించి - పైన కారంపొడి చల్లి బాగానే అందిస్తోంది. సీరియస్ బిజినెస్ అని చెబుతోంది కాబట్టి.. పూజా హోటల్స్ గ్రూప్ ప్రారంభిస్తే, తాజ్ గ్రూప్ ఇక మూసేయడం ఖాయమనే భావించవచ్చేమో!