ఒక లైలా.. తెగ కష్టపడుతోంది

Update: 2015-06-10 09:30 GMT
ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తొలి చిత్రంతోనే చక్కని నటి అన్న పేరు తెచ్చుకుంది. అటుపై తెలుగులో బోలెడన్ని అవకాశాలొచ్చాయి. కానీ వాటన్నిటినీ బాలీవుడ్‌ చిత్రం మొహంజోదారో కోసమే వదులుకున్నా అని చెబుతోంది. ఈ చిత్రంలో కండల హీరో హృతిక్‌ రోషన్‌ సరసన కథానాయికగా నటిస్తోంది. అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కేవలం ఈ ఒక్క సినిమా కోసం రెండున్నరేళ్ల బల్క్‌ డేట్స్‌ కేటాయించింది పూజ. హృతిక్‌ కోసం, అశుతోష్‌ కోసం ఈ డేర్‌ ఫీట్‌ వేశానని అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా ఆన్‌సెట్స్‌, ఆఫ్‌ ది సెట్స్‌ హీరోతో రొమాన్స్‌ చేస్తోందని పుకార్లు శికారు చేస్తున్నాయి. హృతిక్‌ అసలే ఒంటరిగా ఉన్నాడు. అందుకే అతడిని కలిపేసుకుందని అంటున్నారు. ఇదే విషయాన్ని పూజానే ప్రశ్నిస్తే .. పకపకా తనదైన శైలిలో నవ్వేసింది. లింకప్‌ వార్తలు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. వాటిని నేను పట్టించుకోను. హృతిక్‌ ఓ మంచి స్నేహితుడు మాత్రమే.. అని రొటీన్‌గా సమాధానం చెప్పింది.

అలాగే మొహంజోదారో వల్ల ఇతర అవకాశాలు పోగొట్టుకోవడాన్ని రిగ్రెట్‌గా భావించనని చెప్పింది. గ్రామీ అవార్డుల వేడుకల్లో ఏరియల్‌ డ్యాన్స్‌ చూశాను. పింక్‌ అద్భుతంగా చేసింది. అలాంటి డ్యాన్సుల నేర్పే చోటు ఎక్కడుందో వెతికి పట్టుకున్నా. ముంబైలో ప్రస్తుతం క్లాసులకు వెళుతున్నానని చెప్పింది పూజా. అంటే మునుముందు ఈ అమ్మడి నుంచి టాప్‌ యాంగిల్‌ నుంచి ఏరియల్‌ డ్యాన్స్‌ వీక్షించే ఛాన్సుందన్నమాట!

Tags:    

Similar News