పూజా వాల్మీకికి హెల్ప్ అవుతుందా ?

Update: 2019-09-16 09:10 GMT
ఈ శుక్రవారం రానున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. నిన్న వెంకటేష్ అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇదిలా ఉండగా ఇందులో పూజా హెగ్డే నటించడం పైకి ప్లస్సుగానే కనపడుతోంది కాని తన పాత్ర పరిధి సినిమా మొత్తం ఉండదు కాబట్టి మాస్ ఈ విషయంలో ఎంత వరకు సంతృప్తి చెందుతారనే దాని మీద అనుమానాలు లేకపోలేదు.

డిజేలో తనకు గుర్తింపు వచ్చే రోల్ ఇచ్చాడన్న అభిమానంతోనే పూజా హెగ్డే వాల్మీకి ఒప్పుకుందని అందులోనూ తక్కువ కాల్ షీట్స్ కాబట్టి పెద్దగా ఆలోచించలేదని ఇంతకు ముందే టాక్ వచ్చింది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే తాను ఉంటుందన్న న్యూస్ ఇంకొన్ని సందేహాలు రేపెలా ఉంది. పూజా హెగ్డేని మినహాయించి చూస్తే కథ ప్రకారం వర్తమానంలో వచ్చే ఊర మాస్ గణేష్ పాత్రకు జోడి ఉండదు.

అధర్వాకు జంటగా మృణాళిని ఉంటుంది కాని వరుణ్ తేజ్ రోల్ మాత్రం సోలోగానే నడుస్తుంది. మరి అలాంటప్పుడు హీరొయిన్ లేకుండా అంత లెంత్ లో దర్శకుడు హరీష్ శంకర్ గణేష్ ప్రెజెంట్ ట్రాక్ ని ఎలా నడిపాడు అనే సందేహం రావడం సహజం. వీటికి సమాధానం దొరికేది మాత్రం 20వ తేదినే. మిక్కి జే మేయర్ సంగీతం మాస్ కు బాగానే కనెక్ట్ అయ్యింది కాని అసలు కంటెంట్ ఏ మేరకు మెప్పిస్తుందో అన్న ఆసక్తి ఫిలిం నగర్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News