అయ్యో బుట్ట బొమ్మకి ఎంత కష్టం వచ్చింది..!

Update: 2022-11-07 05:22 GMT
సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బ్యూటీ పూజా హెగ్దే. బుట్టబొమ్మ సినిమాలో ఉంది అంటే సినిమా మ్యాక్సిమం సూపర్ హిట్ అనే టాక్ టాలీవుడ్ లో ఉంది. మొదట్లో ఇక్కడ చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవగా రూట్ మార్చి గ్లామర్ గేర్ వేసిన అమ్మడు అప్పటినుంచి వరుస సక్సెస్ లు అందుకుంటుంది. అంతేనా కెరియర్ టాప్ గేర్ లో కొనసాగిస్తున్న అమ్మడు స్టార్స్ అందరితో సినిమాలు చేస్తూ వస్తుంది. అవి సక్సెస్ అవుతుండటంతో పూజా హెగ్దే కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం పూజా హెగ్దే కెరియర్ కి ఇది గోల్డెన్ పిరియడ్ అని చెప్పొచ్చు.

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నా దొరికిన ఆ కొద్ది టైం లోనే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంది పూజా హెగ్దే. సినిమాలతో మాత్రమే కాదు తన హాట్ ఫోటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ లో తన మీద ఆసక్తి మరింత పెరిగేలా చేసుకుంటుంది.

బాలీవుడ్ లో కిసి కి జాన్ కిసి కా భాయ్ సినిమా చేస్తున్న అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబో లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి సైన్ చేసింది. త్రివిక్రం తో పూజా హెగ్దేకి కూడా ఇది హ్యాట్రిక్ మూవీ. సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లో పూజా హెగ్దే కాలికి గాయమైందట. అందుకే ఆమె కాలికి ఒక పట్టి వేసుకుని కనిపించింది. కాలు బెనికిందో లేక వాసిందో కానీ అమ్మడు కొద్దిరోజులుగా ఈ సమస్యతో బాధపడుతుంది.

మొన్న మేకప్ రూం లో పట్టితో ఉన్న కాలి ఫోటో షేర్ చేసింది. లేటెస్ట్ గా ఆ నొప్పిని భరించలేక వేడి నీళ్ల కాపడం పడుతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా బకెట్ లోనే అమ్మడు కాలు పెట్టేసి రిలక్స్ అవుతుంది. పూజా హెగ్దే కష్టాన్ని చూసి అయ్యో బేబీ నీకెంత కష్టం వచ్చింది అనేస్తున్నారు నెటిజెన్లు.

అంతేకాదు అమ్మడు మేకప్ లెస్ ఫోటోలకు ఫిదా అవుతున్నారు. ఎప్పుడు తన హాట్ షోతో సోషల్ మీడియాని షేక్ చేసే పూజా హెగ్దే ఇలా తన కాలి నొప్పిని భరిస్తూ అది అభిమానులతో షేర్ చేసుకోవడం మొదటిసారి.

గ్లామర్ ఎక్స్ పోజర్ లో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్న పూజా హెగ్దే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన అందాలతో అలరిస్తుంది. సూపర్ ఫాంలో ఉంది అనుకునే టైం లో పూజా హెగ్దే ఖాతాలో మూడు వరుస అపజయాలు పడ్డాయి. బీస్ట్, ఆచార్య, రాధే శ్యాం 3 సినిమాలు భారీ అంచనాలతో వచ్చి నిరాశపరచాయి. అందుకే మరో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది పూజా హెగ్దే. హిందీలో తీస్తున్న సినిమా ఎలా ఉన్నా తెలుగులో సూపర్ స్టార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ పై కన్నేసింది అమ్మడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News