బుట్టబొమ్మ గాయపడింది.. ఫ్యాన్స్ కంగారు

Update: 2022-10-20 13:14 GMT
తెలుగు.. హిందీ సినిమాలతో పాటు తమిళంలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తెలుగు లో ప్రస్తుతం మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల్లో త్వరలోనే పూజా హెగ్డే పాల్గొనే అవకాశం ఉంది.

మరో వైపు సల్మాన్ ఖాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో ఉన్నారు. బిజీ బిజీగా ఎప్పుడు ఉండే పూజా హెగ్డే ఒక్కసారిగా సైలెంట్ అయ్యి బెడ్‌ కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కాలికి గాయం అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా పూజా హెగ్డే షేర్ చేసింది.

కాలికి కట్టు ఉంది.. పెద్ద గాయం అన్నట్లుగా అనిపించడం లేదు కానీ ఏదో ప్రమాదం జరిగినట్లుగా మాత్రం ఆ గాయం ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే ఈ ఫోటోను షేర్ చేసి అభిమానులను కంగారు పెట్టింది. ఏం జరిగింది... ఎలా జరిగింది అనే విషయాన్ని క్లీయర్ గా చెప్పకుండా అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

ముద్దుగుమ్మ పూజా హెగ్డే సినిమా షూటింగ్‌ లో గాయపడిందా లేదంటే మరేదైనా చోట గాయం చేసుకుందా తెలియాల్సి ఉంది. పూజా హెగ్డే తెలుగు లో మహేష్‌ బాబు సినిమా షూట్‌ లో జాయిన్‌ అవ్వాల్సి ఉండగా ఇలా జరగడంతో మహేష్ బాబు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆమె కాలి గాయం చూస్తూ ఉంటే ఎక్కువ రోజుల పాటు విశ్రాంతి అవసరం లేకుండా త్వరగానే షూట్‌ లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ముందు ముందు అయినా ఈ బుట్ట బొమ్మ కాలికి ఏం అయ్యిందో చెప్పనుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News