లిప్ లాక్ అదిరిపోయిందంటున్న గోపికమ్మ

Update: 2016-08-01 06:52 GMT
ఈ రోజుల్లో లిప్ లాక్స్ చాలా కామన్ అయినప్పటికీ.. తొలిసారి అలాంటి సీన్ చేసేటపుడు ఏ హీరోయిన్‌కైనా ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ కెరీర్ ఆరంభం నుంచి ట్రెడిషనల్‌ గా కనిపిస్తూ వస్తున్న పూజా హెగ్డే లిప్ లాక్ విషయంలో చాలా ఇబ్బంది పడి ఉంటుందేమో అనుకుంటాం. కానీ ‘మొహెంజదారో’లో హృతిక్ రోషన్ తో లిప్ లాక్ చేయడానికి తాను ఎంతమాత్రం ఇబ్బంది పడలేదని.. చాలా సింపుల్ గా ఆ సీన్ అయిపోయిందని అంటోంది పూజా. మొహెంజదారోలో హృతిక్ తో తాను చేసిన లిప్ లాక్.. బెస్ట్ ఆన్ స్క్రీన్ కిస్సెస్ లో ఒకటిగా నిలుస్తుందని ఆమె చెప్పింది.

‘‘ఓ పక్క ఆర్క్ లైట్స్ వేడి.. మరో పక్క చుట్టూ వంద మంది ఉన్నారు. ఇలాంటపుడు పర్సనల్ ఫీలింగ్స్ ఏముంటాయి చెప్పండి. సీన్ బాగా రావాలన్న ఆలోచన తప్ప ఇంకేమీ ఉండదు. ముద్దు సీన్ అయినా అంతే. స్క్రీన్ మీద లిప్ లాక్ బాగా రావాలని ఆలోచిస్తామే తప్ప అందరూ చూస్తున్నారు.. మనం ముద్దు సీన్ చేస్తున్నాం అనే బిడియం ఉండదు. ఇక మొహెంజదారో విషయానికి వస్తే అప్పటికే చాలా రోజుల నుంచి షూటింగ్ చేస్తుండడం వల్ల హృతిక్.. నేను మంచి స్నేహితులైపోయాం. దాన్నో ముద్దు సీన్ లాగా చూడలేదు. మామూలు సీన్ లాగే ముగించేశాం ముద్దు ఎప్పుడు మొదలైందో తెలియదు. ఎప్పుడు ముగిసిందో తెలియలేదు. నేనేం సిగ్గు పడలేదు. ఇది బెస్ట్ ఆన్‌ స్క్రీన్ లిప్ లాక్స్ లో ఒకటిగా నిలుస్తుందని నా నమ్మకం’’ అని పూజా చెప్పింది.
Tags:    

Similar News