వేడెక్కించిన 'మ‌హ‌ర్షి' బ్యూటీ

Update: 2019-03-29 14:29 GMT
ముంబై బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన‌ తీరు ఆస‌క్తిక‌రం. ఓవైపు మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ల నుంచి తీవ్ర‌మైన పోటీ నెల‌కొన్నా.. వ‌రుసగా ఫ్లాపులు ఎదురైనా.. అవేవీ పూజా హవాని ఆప‌లేక‌పోయాయి. ఇప్ప‌టికిప్పుడు వ‌రుస‌గా అగ్ర క‌థానాయ‌కుల‌ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న `మ‌హ‌ర్షి`, ప్ర‌భాస్ స‌ర‌స‌న `జాన్` చిత్రాల్లో పూజా న‌టిస్తోంది. మ‌హ‌ర్షి మే 9న రిలీజ‌వుతోంది. జాన్ చిత్రం 2020 సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానుంది. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ పూజా పెద్ద రేంజులో కెరీర్ ని ప్లాన్ చేస్తోంది.

మ‌రోవైపు పూజా హెగ్డే ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో నిరంత‌రం హాట్ టాపిక్. అక్క‌డ ర్యాంప్ షోలు, అవార్డు కార్య‌క్ర‌మాలు, ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లోనూ పూజా రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తుంటుంది. తాజాగా ప్ర‌తిష్ఠాత్మ‌క ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ క‌వ‌ర్ పేజీకి పూజా ఇచ్చిన ఫోజు కుర్ర‌కారులో దూసుకుపోతోంది. ఈ ఫోటోషూట్ లో పూజా లుక్ స్ట‌న్నింగ్ అనే చెప్పాలి. బోల్డ్ & డ‌స్కీ బ్యూటీ పూజా అనేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం అక్క‌ర్లేదేమో!

డార్క్ థీమ్.. డార్క్ యాంబియెన్స్ లో డార్క్ ప్రాప‌ర్టీ న‌డుమ థిక్ డిజైన‌ర్ ప‌ర్పుల్ వేర్ లో పూజా ఇచ్చిన ఫోజు కిల్లింగ్ అనే చెప్పాలి. చింత పిక్క రంగు డిజైన‌ర్ టాప్ లో దుమ్ము రేపేసింది. థీమ్ కి త‌గ్గ‌ట్టు పూజా డ్రెస్ కోడ్ ఫెంటాస్టిక్ గా కుదిరింది. ల‌గ్జ‌రీ లుక్ కి స్పైసీ అప్పియ‌రెన్స్ మైమ‌రిపించింది. ప్ర‌స్తుతం ఈ డ్రెస్ డిజైన్ పై యువ‌త‌రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ చేతికి ఉన్న గాజులు.. చెవికి రింగ్స్.. టాప్ ప్ర‌తిదీ చ‌ర్చ‌కొచ్చాయి. రాజ్ దీప్ రాణావ‌త్ ఈ ఔట్ ఫిట్ ని రూపొందించారు. డేనియ‌ల్ పూజా హెయిర్ & మేక‌ప్ కి వ‌ర్క్ చేశారు. అర్జున్ ఫోటోగ్ర‌ఫీ అందించారు.
Tags:    

Similar News