దేశవ్యాప్తంగా దసరా సందడి దేవీ నవరాత్రల వైభవం కనిపిస్తోంది. సెలబ్రిటీల ఇండ్లలోనూ సందడి వాతావరణం నెలకొంది. కానీ బిజీ క్వీన్ పూజా హెగ్డేకి మాత్రం సమయం చిక్కినట్టు లేదు. ఇంకా షూటింగుల ఫోబియో నుంచి బయటికి వచ్చినట్టు లేదు. తాజాగా పూజా హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ లో `గర్బా ఫోమో`ను వదిలించుకోవడానికి తన వానిటీలో గర్బా ప్లే చేస్తున్న వీడియోను విడుదల చేసింది.
వీడియో క్లిప్ ను రిలీజ్ చేసి ``గర్బా నైట్ ఇన్ ది వానిటీ... మీరు ప్రతిరోజూ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు.. మీకు గర్బా ఫోమో ఉన్నప్పుడు ఇలా చేయాలి..`` అని ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో తన వ్యక్తిగత స్టాఫ్ తో కలిసి గర్భా నృత్యం చేస్తూ కనిపించింది పూజా. రెడ్ టాప్ వైట్ షార్ట్ లో ఎంతో ఎనర్జిటిక్ గా నృత్యం చేస్తూ ఆకట్టుకుంది.
నిన్నటిరోజున ముంబైలోని జిమ్ వెలుపల కెమెరా ఫ్లాష్ లకు చిక్కిన పూజా బ్లూ క్రాప్ టాప్ - బ్లాక్ లెగ్గింగ్స్ తో వర్కౌట్ దుస్తులలో అద్భుతంగా కనిపించింది. బ్లాక్ షేడ్స్ తో పర్ఫెక్ట్ టోన్డ్ అబ్స్ ని ప్రదర్శించింది. ఇంతలోనే వ్యానిటీ వ్యాన్ లో ఇలా డెనిమ్ షార్ట్ లో ప్రత్యక్షమైంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పూజా హెగ్డే తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 లో మహేష్ బాబు సరసన నటించనుంది. ఈ చిత్రం ప్రైమరీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 10 నుండి రెండవ షెడ్యూల్ ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే పాల్గొనగా యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా సెట్స్ లో చేరే అవకాశం ఉంది. 2019 చిత్రం మహర్షిలో మహేష్ బాబుతో పూజా స్క్రీన్ స్పేస్ ను పంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండోసారి అతడి సరసన అవకాశం దక్కించుకుంది.
ఈ మూవీతో పాటు పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జన గణ మన`లో లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించనుంది. ఇంతకుముందు మోషన్ పోస్టర్ విడుదలైంది. VD ఆర్మీ యూనిఫాం ధరించి ఛాపర్ నుండి వచ్చే దృశ్యాన్ని మోషన్ పోస్టర్ లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. తదుపరి షెడ్యూల్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` చిత్రంలో నటిస్తోంది. అలాగే రణవీర్ సింగ్ సరసన `సర్కస్`లోను పూజా నటిస్తోంది. రాధేశ్యామ్ - బీస్ట్ ఫ్లాపులైనా ఆ ప్రభావం పూజా కెరీర్ పై పడకపోగా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View